Best Web Hosting Provider In India 2024

వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడి
వైయస్‌ఆర్‌సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు
వ్యక్తిగత కారణాలని పోలీసులు క్రియేట్ చేశారు
హత్య చేసిన జిలాని వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అని దుష్ప్రచారం చేశారు
నిందితుడు జిలాని టీడీపీ మనిషే
రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్ కోరతాం
ఢిల్లీలో ధర్నా చేస్తాం..రాష్ట్రపతి పాలనను డిమాండు చేస్తాం
వినుకొండ: ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీ బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దారుణ హత్యకు గురైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా బుధవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని సహా అందరినీ కలుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వివరిస్తామన్నారు.
వైయస్ జగన్ ఏమన్నారంటే..
45 రోజుల్లో దాదాపు 46 రాజకీయ హత్యలు..300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లలో చొరబడుతున్నారు. షాపులను కాల్చివేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల చీనిచెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను «ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా ధౌర్జన్యాలు, దాడులు చేశారు. 45 రోజులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఇదీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఉందో నిదర్శనం రషీద్ కేసే తీసుకోవచ్చు.
ఇదే వినుకొండకు ఇంతకు ముందు రవిశంకర్‌రెడ్డి ఎస్పీగా ఉండేవారు. మంచి ఆఫీసర్. అలాంటి ఆఫీసర్‌ను తప్పించారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న బిందుమాధవ్ అనే అధికారిని ఎస్పీగా నియమించారు. ఆయన్ను ఎన్నికల కమీషనే సస్పెండ్ చేసింది. ఆ తరువాత మల్లికాగర్గ్‌ను నియమించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్‌ను ఇక్కడి నుంచి పంపించారు. గర్గ్ వెళ్లిపోయిన కొత్త ఎస్పీ శ్రీనివాస్‌ను తెచ్చుకున్నారు. కొత్త ఎస్పీ వచ్చిన రెండు, మూడు రోజులకే హత్య జరిగింది. అత్యంత దారుణంగా నడిరోడ్డుపై ప్రజలంతా చూస్తుండగా అమాయకుడైన రషీద్‌ను అతి కిరాతకంగా అందరూ చూస్తుండగా కత్తితో నరకడం, వైయస్‌ఆర్‌సీపీకి సంబంధించిన సానుభూతిపరులను ఈ మాదిరిగా నరకుతామని ఒక మెసేజ్ పంపించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు పత్రికల ముసుగులో దిగజారిపోయారు. ఎప్పుడో మోటర్ బైక్‌ను కాల్చితే ఇప్పుడు హత్య చేసినట్లు ఈనాడులో దిక్కుమాలిన కథనాలు రాస్తున్నారు. ఆ మోటర్ బైక్ జిలానిది కాదు. ఆ బైక్ ఆసిఫ్ అనే వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వ్యక్తిది. ఆ మోటర్ బైక్‌ను వాళ్లే కాల్చి, గాయపరిచి 17.01.2024లో కేసు పెట్టారు. ఆ కేసు పోలీసులు తీసుకోలేదని అప్పట్లో తప్పుడు ప్రచారం కూడా చేశారు. రషీద్ హత్య జరిగిన వెంటనే ఎలాంటి విచారణ చేయకుండానే ఎస్పీ బయటకు వచ్చి వ్యక్తిగత తగాదాలతో హత్య జరిగిందని ప్రకటిస్తారు. ఒక్క జిలానిపైనే కేసు పెట్టడం ఏంటి? లోకేష్ పుట్టిన రోజున ఎమ్మెల్యే సతీమణికి కేక్ తినిపిస్తున్న జిలానికి, స్థానిక ఎమ్మెల్యేతో ఎలాంటి సంబంధం లేదా? ఎమ్మెల్యేతో ఫోటోలు దిగాడు. వీరంతా కేసులో ఎందుకు లేరు. ఇంతకన్నా అన్యాయంఎక్కడైనా ఉందా?
నిన్న సిట్టింగ్ ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. పుంగనూరు అన్నది తన సొంత నియోజకవర్గం, వాళ్ల నాన్న ఎమ్మెల్యే..మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు నివాసి. ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్భ్రందం చేసి, రెడ్డప్ప కారును కాల్చేశారు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరుగుతుంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడైనా ఉందా? దొంగ కేసులు పెడుతున్నారు. లా అండ్ అర్డర్ గురించి పోలీసులు పట్టించుకోవడం లేదు.
అమ్మాయిల మీద హత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పట్టించుకోవద్దు అని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. గతంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా టీడీపీ వాళ్లను కొట్టండి అని చెప్పలేదు. అక్కచెల్లెమ్మలు బయటకు వెళ్తే తమ ఫోన్‌లో దిశ యాప్ ఉండేది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు 5 నిమిషాల్లో పోలీసులు అండగా నిలిచేవారు. చంద్రబాబు అనే వ్యక్తి తప్పుడు మాటలు, తప్పుడు వాగ్ధాలు చేసి, ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాడు.
వైయస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే..
ఇదే వైయస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే..విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి మూడు నెలలకు అందేది. ఇప్పుడు ఇవన్నీ బకాయిలే. వైయస్ జగన్ ఉండి ఉంటే ప్రతి మూడు నెలలకు డబ్బులు తల్లులకు ఇచ్చేవారు. ఈపాటికి రైతు భరోసా, అమ్మ ఒడి డబ్బులు వచ్చేవి. సున్నా వడ్డీ డబ్బులు మహిళలకు అందేవి. మత్స్యకార భరోసా అందించేవారు. ఈ రోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆ డబ్బులు ఎప్పుడిస్తారు?
ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏంటి? ప్రతి నెల 1500 అక్కచెల్లెమ్మలకు ఇస్తామన్నారు. బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇవ్వాలి.
అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ గళం విప్పుతుంది. రాష్ట్రంలోని పరిస్థితులు దేశమంతా చూసేలా బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ధర్నా చేస్తాం. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరాం, హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తాం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
రషీద్ కుటుంబం చేసిన పాపమేంటి? ఎందుకంత దారుణంగా ఆయన్ను చంపారు. ఈ ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇకమీదట ఇలాంటి ఘటనలు జరుగవని చంద్రబాబు భరోసా ఇవ్వాలి. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించేలా పోరాటాలు చేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు