Thangalaan Release Date: గుడ్‌న్యూస్‌.. విక్రమ్‌ తంగలాన్‌ రిలీజ్‌ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్‌

Best Web Hosting Provider In India 2024

Thangalaan Release Date: తమిళ ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తంగలాన్ మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. చియాన్ విక్రమ్ నటిస్తున్న ఈ పీరియడ్‌ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రానుంది. మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప 2 రిలీజ్ వాయిదా పడటంతో మిగిలిన సినిమాలు ఆ వీకెండ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

తంగలాన్ రిలీజ్ డేట్ ఇదే

పా రంజిత్‌ డైరెక్షన్‌లో విక్రమ్ నటిస్తున్న మూవీ తంగలాన్‌. కేజీఎఫ్‌ అసలు కథను తెరపైకి తీసుకొస్తున్నామంటూ మేకర్స్ చెబుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను శుక్రవారం (జులై 19) మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ఆగస్ట్‌ 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. దీంతో విక్రమ్ తంగలాన్‌కు ఆ సినిమాల నుంచి గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ కాగా.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో మాళవికా మోహనన్‌ నెగటివ్ రోల్ పోషిస్తుండటం విశేషం. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ లాంటి వాళ్లు కూడా ఇందులో నటిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఈ మధ్యే అతడు ఈ సినిమాకు తన ఫస్ట్ రివ్యూ కూడా ఇవ్వడం విశేషం.

తంగలాన్‌ ఫస్ట్ రివ్యూ

తంగలాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. తంగలాన్ సినిమా గురించి రాసుకొచ్చారు. “అద్భుతమైన సినిమా. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఇప్పటికే పూర్తి చేశాను. త్వరలోనే మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ రాబోతుంది. రెడీగా ఉండండి. ఇండియన్ సినిమా రికార్డులకు రెడీగా ఉండు” అని జీవీ ప్రకాష్ ఎక్స్‌లో తెలిపారు.

ఎప్పుడూ పాత్రల కోసం ఎలాంటి కష్టమైన పడే విక్రమ్ తంగలాన్ కోసం 35 కేజీలు తగ్గారట. అలాగే ఇందులో విక్రమ్‌కు ఎలాంటి డైలాగ్స్ ఉండవని, సేమ్ శివపుత్రుడు మూవీలోని పాత్రలా ఉంటుందని, అందులోలాగే తంగలాన్‌లో అరుస్తానని ఓ ఇంటర్వ్యూలో హీరో చెప్పారు.

చియాన్ విక్రమ్ నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. రజనీకాంత్‌తో కబాలి, కాలాతోపాటు స్పారట్ట వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన పా రంజిత్ తంగలాన్‌కు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024