Best Web Hosting Provider In India 2024

పేకమేడలు సినిమాను క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మాతగా నిర్మించారు. ఉమెన్ ఎంపవర్మెంట్‌ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల గారు మాట్లాడుతూ .. “స్టార్టింగ్ నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి 50 కాల్స్ పైన వచ్చాయి. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది” అని చెప్పారు.
“సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాత రాకేష్ గారికి మా టీం కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు” అని పేకమేడలు డైరెక్టర్ నీలగిరి మామిళ్ల అన్నారు.
“దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్‌గా ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్‌కు వస్తారు” అని పేకమేడలు నిర్మాత రాకేష్ వర్రే అన్నారు.
“అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నాకు ఎంతో సపోర్టుగా నిలిచిన అనూష, కేతన్ అదేవిధంగా మార్కెటింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా వస్తే మరోసారి నిరూపించారు. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అని ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే తెలిపారు.
ఇదిలా ఉంటే, పేకమేడలు సినిమాలో హీరో హీరోయిన్ అయిన వినోద్ కిషఇన్, అనూష కృష్ణతోపాటు రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమారు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా జూలై 19న థియేటర్లలో విడుదలైంది.