Mr. Bachchan OTT: ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న రవితేజ కొత్త సినిమా! హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే?

Best Web Hosting Provider In India 2024

Mr. Bachchan OTT: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ చిత్రంపై బోలెడు అంచనాలు ఉన్నాయి. రెండేళ్లుగా తన రేంజ్ హిట్ ఆయన దక్కలేదు. మూడు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో మిస్టర్ బచ్చన్‍పై రవితేజ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన షోరీల్ గ్లింప్స్, పాట ఆకట్టుకున్నాయి. దీంతో బాగానే హైప్ వచ్చింది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ డీల్ జరిగిందనే సమాచారం బయటికి వచ్చింది.

ఏ ఓటీటీ తీసుకుంది?

మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. మంచి ధరకే ఈ మూవీని తీసుకున్నట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా నెట్‍ఫ్లిక్స్ ఈ మూవీ మేకర్లతో డీల్ చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.

మిస్టర్ బచ్చన్ ఓటీటీ హక్కుల విషయంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సెప్టెంబర్‌ ఆఖర్లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా కూడా నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అయితే, థియేట్రికల్ రన్ బట్టి స్ట్రీమింగ్ ప్లాన్‍లలో మార్పులు కూడా ఉండొచ్చు.

మిస్టర్ బచ్చన్‍కు గట్టి పోటీ

మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుందంటూ మూవీ టీమ్ ఇటీవలే ఫిక్స్ చేసింది. అయితే, ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంది. అదే రోజున రామ్‍ పోతినేని యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య ఇండిపెండెన్స్ డే రోజు క్లాష్ జరగనుంది.

మిస్టర్ బచ్చన్ చిత్రం 1980ల బ్యాక్‍డ్రాప్‍లో రూపొందినట్టు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన షోరీల్ చూస్తే ఇది అర్థమవుతోంది. వింటేజ్ లుక్‍తో ఉంది. ఈ షోరీల్‍లో రవితేజ గెటప్, యాక్షన్ అదిరిపోయాయి. ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మిరపకాయ తర్వాత రవితేజ – హరీశ్ శంకర్ కాంబోలో వస్తుండటంతో మిస్టర్ బచ్చన్‍కు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‍కు వీరాభిమాని అయిన మాస్ మహారాజ బచ్చన్ టైటిల్‍లోనే వస్తుండడం మరింత హైప్‍ను తీసుకొచ్చింది.

మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. జగపతి బాబు విలన్‍గా నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేడే రెండో పాట

మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి ఇప్పటికే ఓ మెలోడీ సాంగ్ రాగా.. నేడు (జూలై 25) మాస్ పాట వస్తోంది. ‘రెప్పల్ డప్పుల్’ పేరుతో ఈ సాంగ్ రానుంది. నేటి సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ లిరికల్ సాంగ్ విడుదల కానుంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024