Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి అరాచక పాలనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. చంద్రబాబు నేతృత్వంలో, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో.. రాష్ట్రంలో గత 50 రోజులుగా కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ విజయవంతం అయ్యారు. ఈ పోరాటంలో జాతీయ పార్టీల నాయకుల మద్దతు కూడగట్టుకున్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శ్వేతపత్రాల పేరుతో కూటమి ప్రభుత్వపు అసత్యాలు.. తదితర అంశాలపై వైయస్ జగన్ మాట్లాడతారని సమాచారం. అలాగే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశమూ ఉంది.