Srisailam Dam: పూర్తి స్థాయి నీటి మట్టానికి అడుగు దూరంలో శ్రీశైలం రిజర్వాయర్, సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు

Best Web Hosting Provider In India 2024

Srisailam Dam: శ్రీశైలం జలాశయం నిండడానికి మరో అడుగు దూరం మాత్రమే ఉంది. ఎగువన కృష్ణా బేసిన నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్‌ పది గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద – 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు – ఇన్ ఫ్లో 3,37,891 క్యూసెక్కులు – ఔట్ ఫ్లో 3,33066 క్యూసెక్కులు – ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు – పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు – కుడి, ఎడమ గట్టులో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఉదయం ఆరున్నరకు 884.1 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 215.51 టిఎంసిల నీరు ఉంది. బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యంలో ఇది 97.55శాతంగా ఉంది. శ్రీశైలంకు 4.342లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ ఫ్లో ఉండగా దిగువకు 3.59లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్‌‌ నీటి మట్టం గరిష్ట సామర్థ్యంలో సగానికి చేరింది. 523అడుగులకు నీటివ మట్టం చేరుకుంది. ప్రస్తుతం 315.05 టిఎంసిల నీటి నిల్వ ఉంది. సాగర్‌కు 16,663 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 19వేల ఔట్ ఫ్లో ఉంది.

ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా కనిపిస్తోంది. బ్యారేజీ పది గేట్ల నుంచి దిగువకు మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద నీటి విడుదల చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.

మంగళవారం రాత్రికి జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది.

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటలలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.437 మిలియన్‌ యూనిట్‌ విద్యుత్తు ఉత్పత్తిని, కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.201 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని చేస్తున్నారు. సాగర్‌కు 60,999 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడుకు 20,917 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 1600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

WhatsApp channel

టాపిక్

Srisailam DamSrisailamKrishna RiverFloodsNagarjuna Sagar
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024