Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ 8 తెలుగులో ఈ ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలు.. ఆ యువ హీరో కూడా..

Best Web Hosting Provider In India 2024

Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త సీజన్ లోగోను లాంచ్ చేయడంతోపాటు సెప్టెంబర్ తొలి లేదా రెండో వారం ప్రారంభించనున్నట్లు స్టార్ మా హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతుండగా.. తాజాగా ముగ్గురు టాలీవుడ్ నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి.

బిగ్ బాస్ 8 తెలుగులో ఆ ముగ్గురూ..

బిగ్ బాస్ 7 తెలుగులో ఓ రైతుబిడ్డగా వచ్చి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఈ నేపథ్యంలో ఈ కొత్త సీజన్లో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరు, సామాన్యులు ఎవరు అన్నదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఓటీటీప్లేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. యువ హీరో రాజ్ తరుణ్, కమెడియన్ ప్రభాస్ శ్రీను, యాంకర్ వింధ్య హౌజ్ లోకి వెళ్లనున్నారు.

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్ శ్రీను. అతడు ఈ సీజన్లో కన్ఫమ్ అయ్యాడని సదరు రిపోర్టు తెలిపింది. ఇక ఈ మధ్యే గర్ల్‌ఫ్రెండ్ లావణ్య పోలీసు కేసు పెట్టడంతో వార్తల్లోకి వచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ కూడా కన్ఫమ్ అయ్యాడట. సాధారణంగా కొత్త సీజన్ ప్రారంభ సమయానికి ఎక్కువగా వార్తల్లో ఉండేవారిని ఎంపిక చేసే నిర్వాహకులు రాజ్ తరుణ్ ను కన్ఫమ్ చేయడం విశేషం. ఈ ఇద్దరితోపాటు యాంకర్ వింధ్య విశాఖ కూడా వస్తున్నట్లు తెలిసింది.

కొత్త సీజన్.. కొత్తగా..

బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఈసారి ఈ రియాల్టీ షో కోసం అతడు తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లూ గతంలో వార్తలు వచ్చాయి. గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

ఈ రెండు గ్రూపులకూ రెండు వేర్వేరు సెట్లు కూడా వేశారట. స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లలో ఈ షో చూడొచ్చు. ఈ ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు మరికొందరు తెలుగు సినిమా ప్రముఖులు కూడా హౌజ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

యాంకర్ రితూ చౌదరి, కమెడియన్ యాదమ్మ రాజు, సెలెబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, కుమారీ, యూట్యూబర్లు నిఖిల్, బంచిక్ బబ్లూ, నేత్ర, కుమారి ఆంటీ, బర్రెలక్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ తేదీని ఓ గ్రాండ్ ఈవెంట్ ద్వారా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

గత బిగ్‍బాస్ 7వ సీజన్‍లో రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్‍గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. టైటిల్ దక్కించుకున్నాడు. టీవీ యాక్టర్ అమర్ దీప్ చౌదరి రన్నరప్ అయ్యాడు. సీనియర్ నటుడు శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అర్జున్ ఫైనల్స్ వరకు వెళ్లారు. ఈ సీజన్ ముగిసిన తర్వాత బయట కూడా రచ్చ బాగానే జరిగింది. పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం.. గొడవలు జరగడం.. ఆ తర్వాత అతడి అరెస్ట్ ఇలా కొంతకాలం దుమారం రేగింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024