Gayatri Bhardwaj: ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు.. హీరోయిన్ గాయత్రి పరిష్కారం ఇదే!

Best Web Hosting Provider In India 2024

Buddy Heroine Gayatri Bhardwaj: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్ తెలుగులోకి హీరోయిన్‌గా రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్‌లో రెండో సినిమాగా బడ్డీ చేసింది.

కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బడ్డీ మూవీ ఆగస్ట్ 2న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బడ్డీ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బడ్డీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం (జూలై 31) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటీనటులతోపాటు ఇతర టెక్నిషియన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ.. “బడ్డీ సినిమా తక్కువ టికెట్ రేట్లతో మీ ముందుకు ఆగస్టు 2న వస్తోంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి తప్పక చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎంతో లవ్, హార్డ్ వర్క్‌తో బడ్డీ సినిమా చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను” అని తెలిపింది.

ఇలా ప్రాబ్లమ్స్ మర్చిపోయి, హాయిగా ఎంజాయ్ చేసేందుకు బడ్డీ మంచి పరిష్కారం అన్నట్లుగా గాయత్రి భరద్వాజ్ చెప్పింది. ఇకపోతే సినిమాలోని మరో హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ.. “బడ్డీ రిలీజ్ కోసం మేమంతా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ ఎప్పుడు అని నేను మా డైరెక్టర్‌ను రెగ్యులర్‌గా అడిగేదాన్ని. ఆయన త్వరలోనే అంటూ రిప్లై ఇచ్చేవారు. బడ్డీ మీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. నాకు ఇది ఫస్ట్ మూవీ. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది.

“బడ్డీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శామ్ గారికి థ్యాంక్స్. టెడ్డీ బేర్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. బడ్డీ సినిమాను థియేటర్స్‌లో ఫ్యామిలీతో కలిసి చూడండి” అని నటుడు గోకుల్ పేర్కొన్నాడు.

“బడ్డీ సినిమా ఆగస్టు 2న థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. మేము చేసే మూవీస్‌కు మీడియా సపోర్ట్ ఎంత అవసరమో నాకు తెలుసు. మీ సపోర్ట్ మాకు కావాలి. నేను చేసిన ప్రతి మూవీ నిర్మాతను సంతృప్తిపరిచింది. బడ్డీ విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారు. మా టీమ్ కూడా హ్యాపీగా ఉంది. సినిమా సాధించబోయే సక్సెస్‌తో పాటు నాకు ఇలా మా టీమ్ సంతోషంగా ఉండటమే కావాలి. బడ్డీని థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నా” అని డైరెక్టర్ శామ్ ఆంటోన్ చెప్పారు.

ఇదిలా ఉంటే, బడ్డీ సినిమాలో అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్‌తోపాటు అజ్మల్ అమీర్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024