Wayanad landslides : హ్యాట్సాఫ్​.. 16 గంటల్లోనే బ్రిడ్జ్​ని నిర్మించిన మేజర్​ సీతా అశోక్​ షెల్కే టీమ్​!

Best Web Hosting Provider In India 2024


ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలంగా మారిన కేరళ వయనాడ్​ నుంచి ఎన్నో బాధాకరమైన దృశ్యాలు బయటకు వస్తున్నాయి. వీటి మధ్య మేజర్​ సీతా అశోక్​ షెల్కే ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. మేజర్​ టీమ్​ యుద్ధప్రాదిపతికన, కేవలం 16 గంటల్లోనే వంతెనను నిర్మిచడం ఇందుకు కారణం.

 

16 గంటల్లో వంతెన నిర్మాణం..

కేరళ వయనాడ్​లోని కొండచరియలు విరిగిపడిన చూరల్​మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్స్​పై ఓ మహిళా ఆర్మీ అధికారి సగర్వంగా నిలబడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

 

ఈ వంతెన నిర్మాణానికి బాధ్యత వహించిన భారత ఆర్మీ యూనిట్​లోని ఏకైక మహిళా అధికారి మేజర్ సీతా అశోక్ షెల్కే చిత్రాలు విపత్తు విధ్వంసానికి సంబంధించిన అనేక చిత్రాల మధ్య ప్రత్యేకంగా నిలుస్తాయి. మేజర్ సీతా అశోక్ షెల్కే, భారత సైన్యం ధైర్యసాహసాలు, అంకితభానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

ఎవరు ఈ మేజర్ సీతా అశోక్ షెల్కే?

  • మేజర్ సీతా అశోక్ షెల్కే మహారాష్ట్ర అహ్మద్​నగర్​లోని గాడిల్ గావ్ గ్రామానికి చెందినవారు.
  • బెంగళూరుకు చెందిన ఆర్మీ మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ (ఎంఈజీ)కి చెందిన 70 మంది సభ్యుల బృందంలో ఆమె ఒక్కరే మహిళా అధికారి.
  • ‘మద్రాస్ సాపర్స్’గా పిలిచే ఈ ఇంజనీరింగ్ యూనిట్ సైన్యానికి మార్గం సుగమం చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధరంగంలో మందుపాతరలను కనుగొని నిర్వీర్యం చేసే పనిలో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లో కూడా ఈ యూనిట్ సహాయపడుతుంది. 2018 వరదల సమయంలో కేరళలో చాలా చురుకుగా పనిచేసింది.
  • మద్రాస్ ఇంజినీర్ గ్రూప్ (ఎంఈజీ) శిథిలాల భారాన్ని అధిగమించి, చెట్లు నేలకూలడం, వేగంగా ప్రవహిస్తున్న నదిని అధిగమించి కేవలం 16 గంటల్లో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయగా, మేజర్ సీతా అశోక్ షెల్కే సైనికుల బృందానికి నాయకత్వం వహించారు.
  • అయితే మేజర్ సీతా అశోక్ షెల్కే మాత్రం బ్రిడ్జి నిర్మాణం కేవలం ఆర్మీకి మత్రమే చెందిన విజయంగా భావించడం లేదు.
  • స్థానిక అధికారులకు, రాష్ట్ర అధికారులకు, వివిధ ప్రాంతాల నుంచి తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేయాలి. ‘స్థానికులకు, గ్రామస్తులకు, రాష్ట్ర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని మేజర్ సీతా షెల్కే పేర్కొన్నారు.
  • నిద్రను- భోజనాన్ని కూడా లెక్కచేయకుండా మేజర్ షెల్కే విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో నిర్విరామంగా పనిచేస్తూ, ప్రతి అత్యవసర పరిస్థితిని చూసుకుంటూ.
  • మేజర్​ సీత, ఆమె బృందం అహర్నిశలు శ్రమించి ఎంతో మందిని కాపాడగలిగారు. మృతదేహాలను ఆలస్యం చేయకుండా వెలికితీశారు.
  • భారీ వర్షాలు, వంతెన నిర్మాణానికి పరిమిత స్థలం కారణంగా నిర్మాణం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, మేజర్ షెల్కే, ఆమె బృందం వంతెనను విజయవంతంగా నిర్మించగలిగింది. ఇది కొనసాగుతున్న సహాయక చర్యలకు ఏకైక మార్గంగా మిగిలిపోయింది.
  • మేజర్ షెల్కే, తనను తాను జెండర్​ రోల్స్​కి పరిమితం చేయడానికి సిద్ధంగా లేనని, కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో తన పురుష సహోద్యోగుల మాదిరిగానే పనిచేస్తానని అన్నారు.

 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source link