Telangana Rains : 4 రోజులపాటు భారీ వర్షాలు – హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన, హెచ్చరికలు జారీ

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ లో గురువారం వర్షం దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే ఇవాళ సాయంత్రం తర్వాత మళ్లీ వాన మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, ప్రగతి నగర్, అమీర్ పేట్, సచివాలయం, ఎల్బీ నగర్, హయత్ నగర్ తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలో బలమైన ఉపరిత గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆగస్టు 17వ తేదీ ఉదయం 8. 30 తర్వాత వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

టాపిక్

WeatherImdTrainsAp RainsTs RainsHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024