OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024


ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘జీ5’ ఇటీవలి కాలంలో వరుసగా వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ముఖ్యంగా క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. వాటికి వ్యూస్ కూడా అదే విధంగా వస్తున్నాయి. ఈ తరుణంలో జీ5 ఓటీటీలో మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. ముర్షిద్ పేరుతో ఈ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్‍లో కేకే మీనన్, తనూజ్ విర్వారీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ఫస్ట్ లుక్‍తో పాటు స్ట్రీమింగ్ డేట్‍ను నేడు (ఆగస్టు 16) వెల్లడించింది జీ5 ఓటీటీ.

ఫస్ట్ లుక్ ఇలా..

కేకే మీనన్, తనూజ్ విర్వారీతో ముర్షీద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జీ5 తీసుకొచ్చింది. కేకే మీనన్ గన్ పట్టుకొని ఉన్నారు. బ్యాక్‍గ్రౌండ్‍లో ముంబై సిటీ కనిపిస్తోంది. ముంబై నగరంపై పట్టుకోసం సాగే గ్యాంగ్‍స్టర్ డ్రామాగా ఈ సిరీస్ ఉండనుందని అర్థమవుతోంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ముర్షీద్ వెబ్ సిరీస్ ఆగస్టు 30వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఫస్ట్ లుక్‍తో పాటే ఈ డేట్‍ను ప్రకటించింది. అయితే ఇప్పటికి పెద్దగా వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే టీజర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముర్షీద్ వెబ్ సిరీస్‍లో కేకే మీనన్, తనూజ్‍తో పాటు అనంగ్ దేశాయ్, జాకీర్ హుసేన్, జమీల్ చౌదరి కీలకపాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్‍కు దర్శకుడు ఎవరన్నది జీ5 ప్రస్తుతానికి వెల్లడించలేదు.

ఇటీవలే కేకే మీనన్ ‘శేఖర్ హోమ్’

కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించిన శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ ఇటీవలే జియో సినిమా ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ డిటెక్టివ్ సిరీస్ ఆగస్టు 14న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. డిటెస్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు దర్శకులు రోహన్ సిప్పీ, శ్రీజిత్ ముఖర్జీ. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ జియోసినిమాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇంగ్లిష్ పాపులర్ డిటెక్టివ్ డ్రామా సిరీస్ షెర్లాక్ హోమ్స్ స్ఫూర్తితో శేఖర్ హోమ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్‍లో కేకే మీనన్ తన మార్క్ నటనతో మెప్పించారు.

ఇదే నెలలోనే కేకే మీనన్ నుంచి ముర్షిద్ పేరుతో జీ5 ఓటీటీలో మరో సిరీస్ వస్తోంది. ఆగస్టు 30న ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

జీ5లో అదరగొడుతున్న ‘గ్యారా.. గ్యారా’

జీ5 ఓటీటీలో ప్రస్తుతం ‘గ్యారా.. గ్యారా’ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. ఈ సిరీస్ ఆగస్టు 9న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంకా జీ5లో ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. ఈ సిరీస్‍లో రాఘవ్ జుయల్, ధైర్య కర్వా, కృతిక కర్మ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు ఉమేశ్ బిస్త్ దర్శకత్వం వహించారు. ఏకకాలంలో మూడు టైమ్‍లైన్ల మధ్య సాగే కథతో ఇంట్రెస్టింగ్‍గా ఈ సిరీస్‍ను డైరెక్టర్ తెరకెక్కించారు. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును కూడా గ్యారా గ్యారా సిరీస్ జీ5 ఓటీటీలో ఇప్పటికే దాటేసింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024