CM Chandrababu : ఆటో డ్రైవర్ కు సీఎం చంద్రబాబు హామీ, రెండు రోజుల్లోనే ఇంటికి ఎలక్ట్రిక్ ఆటో

Best Web Hosting Provider In India 2024


CM Chandrababu : సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అనంతరం నిర్వహించిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రజినీకాంత్ తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నానని రజినీకాంత్ సీఎంకు తెలిపారు. డీజిల్ ఖర్చులు పెరగడంతో ఆటోపై వచ్చిన ఆదాయం ఖర్చులకే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ఇంధనం ఖర్చు తగ్గుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలంటే రూ.3 లక్షలు ఖర్చవుతుందని రజినీకాంత్ చెప్పారు. దీంతో రజినీకాంత్ తోనే ఎలక్ట్రిక్ ఆటో అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రజినీకాంత్ కుమారుడు రవితేజ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, తన చెల్లి బీడీఎస్‌ చదువుకు అండగా నిలుస్తాడని చంద్రబాబు తెలుసుకున్నారు. ఆడ పిల్ల చదువుకు ఎలాంటి ఆటంకం రాకూడదని, రజినీకాంత్ కు ఎలక్ట్రిక్ ఆటో సమకూరుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు రెండు రోజుల వ్యవధిలోనే రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను రజినీకాంత్ కు అందించారు.

గంటల వ్యవధిలోనే ఇంటికి ఆటో

కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్టీవో నిమ్మగడ్డ శ్రీనివాస్‌ గురువారం రాత్రి అపే ఈసిటీ ఆటో కొనుగోలు చేశారు. గుడివాడ మున్సిపల్‌ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రజినీకాంత్ కు ఆటోను స్వయంగా అందించారు. సీఎం చంద్రబాబు మాట ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆటో తన ఇంటికి వచ్చిందని ఆటో డ్రైవర్ రజినీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన మేలు తమ కుటుంబం ఎప్పుడూ మరచిపోదన్నారు.

పూర్ టు రిచ్.. ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి. పేదలకు మరింత ఆదాయం రావాలి.. ఇదే చంద్రబాబు ఆలోచన అని టీడీపీ ట్వీట్ చేసింది. ఆగస్టు 15న కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్ కి మాటిచ్చిన విధంగా ఎలక్ట్రిక్ ఆటో అందించారు సీఎం చంద్రబాబు అని పేర్కంది. చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటో పంపించటంతో ఆటో డ్రైవర్ రజినీకాంత్ సంతోషం వ్యక్తం చేశారని తెలిపింది.

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduGudivada Assembly ConstituencyKrishna DistrictTdpAndhra Pradesh NewsTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024