Ravi Teja: ఏదైనా కథను బట్టే ఉంటుంది.. రవితేజతో ఆ సినిమా కుదర్లేదు.. హ్యాపీ డేస్ మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Music Director Mickey J Meyer About Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడుగా పని చేశారు.

హ్యాపీ డేస్ వంటి సినిమాకు మంచి క్లాసిక్ సాంగ్స్ ఇచ్చి ఎంతో పేరు తెచ్చుకున్న మిక్కీ జే మేయర్ మిస్టర్ బచ్చన్ మూవీలో మాస్ సాంగ్స్ కంపోజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మిక్కీ జే మేయర్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, విశేషాలు పంచుకున్నారు.

మిస్టర్ బచ్చన్ మీకు క్లాస్ నుంచి మాస్ ట్రాన్స్‌ఫర్మేషనా?

మిస్టర్ బచ్చన్ మ్యూజిక్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావాడం చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్ అన్ని ఆడియన్స్‌కు చాలా నచ్చాయి. ఇదొక సర్‌ప్రైజ్ (నవ్వుతూ). నేను మాస్, క్లాస్ అని అలోచించను. సాంగ్స్ అనేవి స్క్రిప్ట్ ప్రకారమే వస్తాయి. మిస్టర్ బచ్చన్‌లో ఇలాంటి మాస్ సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది.

– మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇలాంటి మాస్ సాంగ్స్ చేయడం నాకేం షాకింగ్‌గా లేదు. నేను ఇలాంటి మాస్ సాంగ్స్ చేయగలనని నాకు తెలుసు. ఏదైనా మనకొచ్చిన కథని బట్టే ఉంటుంది.

ఇందులో ఎక్కువ హిందీ సాంగ్స్ ఉన్నాయి. ఇది ఎవరి ఆలోచన?

-అది మొత్తం డైరెక్టర్ ఐడియా. హరీష్ గారు కిషోర్ కుమార్‌కు బిగ్ ఫ్యాన్. నేను కూడా ఆ సాంగ్స్ విని పెరిగాను. అయితే ఆ పాటలన్నిటికి కొత్త బీట్స్, బ్యాకింగ్ యాడ్ చేసి కొంచెం యాంప్లిఫై చేశాం.

4 ట్యూన్స్ వన్ వీక్‌లో కంప్లీట్ చేశారని డైరెక్టర్ చెప్పారు?

-నేను చాలా ఫాస్ట్‌గా కంపోజ్ చేస్తాను. ఈ ఆల్బమ్ కోసం హరీష్ గారు సియాటిల్ వచ్చారు. అప్పటివరకూ నేను ఎప్పుడూ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చోలేదు. ఆయనతో కూర్చుని వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నాలుగు రోజుల్లో ట్యూన్స్ పూర్తి చేశాం. చాలా నైస్ ఎక్స్‌పీరియన్స్ ఇది.

మీరు అమెరికాలో ఉంటారు. వర్క్ చేసే విధానం ఎలా ఉంటుంది?

-నేను బిగినింగ్ నుంచి అమెరికాలోనే ఉన్నాను. కథ ఫోన్‌లో చెప్తారు. జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. కథ ని విని ట్యూన్స్ ఇస్తాను. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్లీ చేసి పంపిస్తాను. రీరికార్డింగ్ మాత్రం ఇక్కడికి వచ్చి చేస్తాను.

రవితేజ గారి సినిమాకి వర్క్ చేయడం ఎలా అనిపించింది?

-డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు రవితేజ గారితో చేసిన కిక్ సినిమా కోసం నన్ను కలిశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ సినిమాకి తమన్ మ్యూజిక్ చేశారు. అప్పటి నుంచి రవితేజ గారితో వర్క్ చేసే అవకాశం కోసం ఎదురుచూశాను. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌కి మ్యూజిక్ చేయడం పర్ఫెక్ట్ టైమింగ్ అనిపించింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024