Hyderabad: మణికొండలో 225 విల్లాలకు నోటీసులు.. హైడ్రా బాటలో మున్సిపల్ అధికారులు!

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్‌లోని మణికొండ చిత్రపరి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. G.O 658 కు విరుద్దంగా 225 ROW హౌజ్‌ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.

ఈ విల్లాలకు సంబంధించి.. గత సొసైటీ పాలకవర్గం అడ్డదారిలో అనుమతులు పొందినట్టు అధికారులు గుర్తించారు. కేవలం జీ +1 అనుమతులు పొంది.. జీ+2 నిర్మాణాలు చేపట్టారు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే.. బిల్డర్ అడ్డదారిలో అనుమతి తీసుకొని విల్లాలు నిర్మించి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. అతనికి డబ్బులు చెల్లించి.. కొనుగోలు చేసిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

హైడ్రా హడల్..

ప్రస్తుతం హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో హైడ్రా చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారిని హైడ్రా హడలెత్తిస్తోంది. శనివారం హైదరాబాద్‌‌లో టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌‌ను హైడ్రా నేలమట్టం చేసింది. హైటెక్ సిటీ రోడ్డులో ఉన్న తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల స్థలం కబ్జా చేసి.. ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టారు. తుమ్మిడి చెరువును పూడ్చివేసి ఎన్ కన్వెన్షన్‌ నిర్మించినట్టుగా గుర్తించారు.

ఇద్దరు భాగస్వాములు..

మొత్తం 10 ఎకరాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణం జరిగింది. అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది. 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌లో.. 2 ఎకరాలు బఫర్‌ జోన్‌‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం నాగార్జున ఒక్కరిదే కాదు. ఎన్‌ కన్వెన్షన్‌లో హీరో అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి భాగస్వాములుగా ఉన్నారు.

మంత్రి లేఖ..

నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని.. ఈ నెల 21న సీఎం రేవంత్‌ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ హైడ్రాను ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి లేఖపై హైడ్రా కమిషనర్ విచారణ జరిపారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్‌లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి లేఖలో వివరించారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఇతర ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు. కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా.. కూల్చివేతకు రంగం సిద్ధం చేసి నేలమట్టం చేసింది.

టాపిక్

HyderabadTelangana NewsRevanth Reddy

Source / Credits

Best Web Hosting Provider In India 2024