Best Web Hosting Provider In India 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు చాలా నిరీక్షిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మూడేళ్ల కిందట వచ్చిన పుష్ప: ది రైజ్ సినిమా నేషనల్ వైడ్‍గా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. తెలుగుతో హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో అదరగొట్టింది. హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 సినిమాపై నేషనల్ వైడ్‍గా భారీ అంచనాలు, హైప్ ఉంది.
పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల డీల్ తాజాగా పూర్తయినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ విషయంపై రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు ఒప్పందం ఖరారైందని సమాచారం బయటికి వచ్చింది.
ఓటీటీ ధర ఇదే!
పుష్ప 2: ది రూల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.270కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‍ఫ్లిక్స్ కైవసం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీకి హైప్ ఓ రేంజ్‍లో ఉండటంతో ఇంత భారీ ధరను వెచ్చించేందుకు ఆ ఓటీటీ ముందుకు వచ్చింది.
ఆల్‍టైమ్ రికార్డు
దీనిప్రకారం, డిజిటల్ హక్కుల విషయంలో ‘పుష్ప 2: ది రూల్‘ సినిమా ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో అత్యధిక ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా నిలిచింది.
పుష్ప 2 సినిమా హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు తాజాగా మేకర్స్, ఆ ఓటీటీ మధ్య అధికారికంగా డీల్ పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఏకంగా రూ.270 కోట్లు డిజిటల్ హక్కుల రూపంలోనే పుష్ప మేకర్స్‌కు దక్కడం ఖరారైంది.
జోరుగా షూటింగ్
పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అనుకున్న విధంగానే డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవలే స్పష్టంగా చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఈ చిత్రం వాయిదా పడింది. అయితే, మళ్లీ ఆలస్యమవుతుందంటూ ఇటీవల రూమర్లు వచ్చాయి. వీటిని మూవీ టీమ్ కొట్టిపడేసింది. ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుందని చెప్పేశారు.
పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం విషయంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల రూమర్లు వచ్చాయి. అయితే, ఈ ఇద్దరూ కలిసి మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఈవెంట్‍కు హాజరవటంతో ఆ పుకార్లు పటాపంచలు అయ్యాయి. ఈ సినిమా ఎక్కడా తగ్గదంటూ వారిద్దరూ చెప్పారు.
2021 డిసెంబర్‌లో రిలీజైన పుష్ప చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. అల్లు అర్జున్ యాక్టింగ్, మేనరిజమ్స్, స్వాగ్ నేషనల్ వైడ్‍గా ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. పుష్పకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో పుష్ప 2ను గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు సుకుమార్.
పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits