Best Web Hosting Provider In India 2024
సరిపోదా శనివారం సినిమా అంచనాలను అందుకొని సత్తాచాటుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 29న రిలీజైన ఈ మూవీ హైప్‍కు తగ్గట్టే మంచి కలెక్షన్లు దక్కించుకుంటోంది. సరిపోదా శనివారం సినిమా మూడో రోజే ఓ మైల్‍స్టోన్ దాటేసింది.
రూ.50కోట్లు దాటేసి..!
సరిపోదా శనివారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసిందని తెలుస్తోంది. మూడో రోజైన నేడు (ఆగస్టు 31) ఫస్ట్ షో సమయానికే ఈ చిత్రం ఈ మైల్‍స్టోన్ అధిగమించిందని అంచనా. మూడో రోజు కలెక్షన్ల లెక్క రేపు స్పష్టంగా వెల్లడవుతుంది. అయితే, రూ.50కోట్ల గ్రాస్‍ను ఈ చిత్రం దాటేసింది.
వీకెండ్‍లో పెరిగిన జోష్
సరిపోదా శనివారం చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.24.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. ఆ తర్వాతి రోజు శుక్రవారం కావడంతో వసూళ్లలో డ్రాప్ కనిపించింది. సుమారు రూ.12 కోట్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.36.03 కోట్లు సాధించింది. అయితే, వీకెండ్ అయిన నేడు శనివారం ఈ సినిమా కలెక్షన్లలో మళ్లీ పుంజుకుంది. ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లలో దూకుడు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్ట్రాంగ్‍గా ఉంది.
సరిపోదా శనివారం సినిమాకు ఈ వీకెండ్‍లోపే బ్రేక్ ఈవెన్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారమే ఈ మూవీ లాభాల్లోకి వెళుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ బలంగా ఉండడం, పోటీ కూడా పెద్దగా లేకపోవడం ఈ మూవీకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టారు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా బ్లాక్‍బస్టర్ దిశగా సాగుతోంది. దీంతో హ్యాట్రిక్ సాధించారు నేచురల్ స్టార్.
కాస్త దెబ్బ కొట్టిన వర్షం
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లపై కాస్త ప్రభావాన్ని చూపించింది. నేడు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరిగినా.. వానల కారణంగా డైరెక్ట్ టికెట్ల అమ్మకాలపై ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తోంది.
సరిపోదా శనివారం మంచి కలెక్షన్లు దక్కించుకుంటుండటంతో నేడు సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ్, హీరోయిన్ ప్రియాంక మోహన్, నిర్మాత డీవీవీ దానయ్య ఈ మీట్‍లో పాల్గొన్నారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సక్సెస్‍తో టైర్-1 హీరోల లిస్టులోకి వచ్చేశారని అనుకుంటున్నారా అని వచ్చిన క్వశ్చన్‍కు నాని చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ మొదలైందో తనకు తెలియదని, తనకు అది సంబంధం లేని విషయం అని నాని చెప్పారు.
ఇప్పటి వరకు కామెడీ, ఫీల్ గుడ్ సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ తన పంథాకు భిన్నంగా సరిపోదా శనివారం మూవీని మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ప్రేక్షకులను మెప్పించారు. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో భేష్ అనిపించుకున్నారు. విలన్ పాత్ర పోషించిన ఎస్‍జే సూర్య అదరగొట్టారు. సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి బలంగా నిలిచింది. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని – వివేక్ కాంబో ఈ చిత్రంతో రిపీట్ అయింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits