Indian Overseas Bank: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు; ఇలా అప్లై చేయండి..

Best Web Hosting Provider In India 2024


అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ iob.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 550 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ సెప్టెంబర్ 10

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు ఆన్ లైన్ లో అప్లై చేయడానికి చివరితేదీ 10 సెప్టెంబర్ 2024. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ 15 సెప్టెంబర్ 2024. ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష సెప్టెంబర్ 22, 2024న జరిగే అవకాశం ఉంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

అర్హతలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు వర్తించే చోట స్థానిక భాషను పరీక్షిస్తారు. అలాగే, బ్యాంక్ నిర్ణయించిన విధంగా వ్యక్తిగత ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ పరీక్షలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. తమ రాష్ట్రాల్లో ట్రైనింగ్ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని ఏదైనా ఒక స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం, అవగాహన) కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల్లో దివ్యాంగులకు రూ.472, మహిళా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.708, జనరల్/ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.944 ను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి (BFSI SSC) నుండి అవసరమైన పరీక్ష ఫీజు చెల్లించడానికి ఇమెయిల్ కమ్యూనికేషన్ అందుకుంటారు. వారు ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024



Source link