Best Web Hosting Provider In India 2024
Demonte Colony 2 OTT Release: హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. మంచి కథా, కథనం, అదిరిపోయే ట్విస్టులతో సాగే హారర్ చిత్రాలను ఎంతోమంది ఇష్టపడుతుంటారు. మనిషి కామన్ నేచర్ అయిన భయంపై తీసే ఈ సినిమాలు ఎల్లప్పుడు స్పెషల్‌గా ఉంటాయి. సరైనా టేకింగ్‌తో తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటాయి హారర్ సినిమాలు.
సీక్వెల్‌గా తెరకెక్కి
అలా ఈ మధ్య థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ డిమోంటీ కాలనీ 2. 2015లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ డిమోంటీ కాలనీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందే డిమోంటీ కాలనీ 2. ఇటీవల ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లతో సత్తా చాటుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
సుస్సు పోయించేలా
తెలుగులో కూడా విడుదలైన డీమోంటీ కాలనీ 2 సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు, సినిమాను తెలుగులో తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాడు హీరో అరుల్ నిధి. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డిమోంటీ కాలనీ 2 మూవీ ట్రైలర్ సుస్సు పోయించేంతలా భయపెట్టింది.
ట్విస్టులు-టర్న్స్
దాంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయి థియేటర్లలో మంచి సక్సెస్ సాధించింది. సినిమాలో అదిరిపోయే ట్విస్టులు, టర్న్ ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. మరి ఎంతో ఆదరణ పొందిని ఈ వణికించే హారర్ మిస్టరీ థ్రిల్లర్ డిమోంటీ కాలనీ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా ఈ నెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ హారర్ మూవీ.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
డిమోంటీ కాలనీ 2 ఓటీటీ హక్కులను జీ5 సంస్థ మంచి ధరకు కొనుగోలు చేసింది. జీ5 ఓటీటీలో డిమోంటీ కాలనీ 2 సెప్టెంబర్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే, తమిళంతోపాటు తెలుగులో కూడా డిమోంటీ కాలనీ 2 ఓటీటీ రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే రెండు భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది.
తెలుగులో కూడా
కాబట్టి, తమిళం, తెలుగు రెండు భాషల్లో డిమోంటీ కాలనీ 2ని ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. లేదా మొదట తమిళంలో ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగులో డిజిటల్ ప్రీమియర్ చేసే ఛాన్స్ ఉంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఓటీటీ రిలీజ్ డేట్‌కు కొన్ని రోజుల ముందు ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
మిడ్ వీక్‌లోనే
లేదా ఈ ఓటీటీ రిలీజ్ డేట్‌లో ఏమైనా మార్పులు కూడా జరగచ్చు. సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో కాకుండా మిడ్ వీక్‌లో కూడా సడెన్‌గా డిమోంటీ కాలనీ ఓటీటీలోకి రావడానికి ఆస్కారం ఉందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోగా అరుల్ నిధి, హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటించారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits