Best Web Hosting Provider In India 2024
Bigg Boss Telugu 8 September 1st Episode: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 1) చాలా గ్రాండ్‌గా లాంచ్ అయింది. స్టేజీపైకి, హౌజ్‌లోకి నాని, ప్రియాంక మోహన్, రానా దగ్గుబాటి, నివేదా థామస్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. కంటెస్టెంట్స్‌తో టాస్కులు చేయించారు.
7 జంటలుగా
ఆటపాటలతో, డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ డే రోజున మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వారు తమ బడ్డీలతో 7 జంటలుగా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మొదటి కంటెస్టెంట్‌గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ విలన్ యశ్మీ గౌడ రాగా తనకు బడ్డీగా, రెండో కంటెస్టెంట్‌గా నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు.
రానాతో టాస్క్
ఇలా అభయ్ నవీన్-ప్రేరణ కంబం, ఆదిత్యం ఓం-సోనియా ఆకుల, బెజవాడ బేబక్క-ఆర్జే శేఖర్ బాషా, కిర్రాక్ సీత-నాగ మణికంఠ, పృథ్వీరాజ్-విష్ణుప్రియ, నైనిక-నబీల్ అఫ్రిది వరుసగా జంటలుగా హౌజ్‌లోకి వెళ్లారు. అయితే, మొదట నలుగురు కంటెస్టెంట్స్‌గా యశ్మీ గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ కంబం వెళ్లారు. వారికి టాస్క్‌ని రానాతో ఇప్పించాడు నాగార్జున.
నో కెప్టెన్సీ- నో ఇమ్యూనిటీ
ఆ టాస్కులో అభయ్, ప్రేరణ ఓడిపోయారు. దాంతో వారికి ఓ బ్యాడ్ న్యూస్ చెబుతాం అని ట్విస్ట్ ఇచ్చారు. దాన్ని నాగార్జున చెప్పారు. హౌజ్‌లో ఓ బోర్డ్ చూపించి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. అందులో ప్రేరణ ఒకటి సెలెక్ట్ చేసుకోగా.. నో కెప్టెన్ అని వచ్చింది. అంటే సీజన్ మొత్తం నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ అని నాగార్జున పెద్ద షాక్ ఇచ్చాడు.
దొంగతన చేసేది
“మరి గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి” అని ప్రేరణ అడిగితే.. “ఏదైనా నీ లైఫ్‌లో ఎవరికీ చెప్పని సీక్రెట్ చెబితే చెబుతాను” అని నాగార్జున అన్నాడు. దాంతో తాను చిన్నప్పుడు మరి చిన్న చిన్న వస్తువులను వారికి తెలియకుండా తీసుకునేదాన్ని అని ప్రేరణ చెప్పింది. దానికి పక్కన కూర్చుని ఉన్న నిఖిల్.. “సార్.. దొంగతనం చేసేదని చెబుతుంది” అని అన్నాడు.
క్లెప్టోమేనియా వ్యాధి
“ఇప్పుడు కూడా చేస్తున్నావా?” అని నాగార్జున అడిగాడు. “లేదు సార్. చెప్పాను కదా. అది చిన్నప్పుడు. అలా చేసేదాన్ని. కానీ, ఇప్పుడు ఏదైనా తీసుకోవాలంటే వాళ్లను అడిగి మరి తీసేసుకుంటాను” అని ప్రేరణ కంబం చెప్పింది. “దాన్ని ఏం డిజార్డర్ అంటారో తెలుసా?” అని నాగార్జున అంటే.. “హా తెలుసు.. క్లెప్టోమేనియా (Kleptomania)” అని కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ తెలిపింది.
తెలిసి కూడా
“అంటే, దాన్ని ఏమంటారో కూడా నీకు తెలుసు” అని నాగార్జున నవ్వుతూ అన్నాడు. దానికి హా అని ప్రేరణ కూడా నవ్వింది. పక్కన ఉన్న యశ్మీ షాక్ అయి చూసింది. అయితే, క్లెప్టోమేనియా అనేది ఒకరకమైన మెంటల్ డిజార్డర్. ఏవైనా చిన్న వస్తువులను అవసరం లేకున్నా సరే కొనడానికి బదులు దొంగతనం చేస్తుంటారు. అది వాళ్లకు ఒకరకమైన సంతృప్తి, సంతోషాన్ని ఇస్తుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits