Best Web Hosting Provider In India 2024
Saripodhaa Sanivaaram Box Office Collection: హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 29న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.
9 కోట్లతో ఓపెనింగ్
దీంతో సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగుంటున్నాయి. అయితే, మొదటి రోజు ఇండియాలో రూ. 9 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో ఓపెనింగ్ చేసిన ఈ మూవీ రెండో రోజు వసూళ్లు పడిపోయాయి. ఇక మూడో రోజు ఓపెనింగ్ డే అంత రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేసింది. మూడో రోజు రూ. 9.15 కోట్ల నికర వసూళ్లు అర్జించిన ఈ సినిమా 4వ రోజు రూ. 9.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
ఎక్కువగా సండే కలెక్షన్స్
వీటిలో తెలుగు నుంచి రూ. 8.68 కోట్లు, తమిళం నుంచి రూ. 65 లక్షలు, మలయాళం నుంచి రూ. 2 లక్షలు, హిందీ నుంచి రూ. 15 లక్షలుగా ఉన్నాయి. తెలుగు, తమిళంలో నాని సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయని తెలుస్తోంది. ఇక గత మూడు రోజులతో పోలిస్తే.. ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ ఆదివారం నాటి వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి.
4 డేస్ కలెక్షన్స్
శనివారం (ఆగస్ట్ 31- మూడో రోజు) కలెక్షన్స్‌తో పోలిస్తే.. ఆదివారం (సెప్టెంబర్ 1- 4వ రోజు) వసూళ్లు 3.83 శాతం కాస్తా ఎక్కువగా ఉన్నాయి. ఇక నాలుగు రోజుల్లో మొత్తంగా ఇండియా వ్యాప్తంగా సరిపోదా శనివారం సినిమాకు రూ. 33.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 31.34 కోట్లు, తమిళం నుంచి 1.79 కోట్లు, మలయాళం ఐదు లక్షలు, హిందీ బెల్ట్‌లో రూ. 32 లక్షలుగా వసూళ్లు ఉన్నాయి.
78 శాతం రికవరీ
అలాగే ఇండియాలో 4 రోజుల్లో సరిపోదా శనివారం గ్రాస్ కలెక్షన్స్ రూ. 39.25 కోట్లు కాగా.. ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 18 కోట్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 59.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 32.72 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అంటే, ఇప్పటివరకు చిత్రానికి 78 శాతం వసూళ్లు రికవరీ అయ్యాయి.
ఇంకా 9 కోట్లకుపైగా
ఇక రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన నాని సరిపోదా శనివారం సినిమాకు ఇంకా 9.28 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. అలా అయితేనే సినిమా హిట్ కొట్టినట్లు అవుతుంది. దసరా, హాయ్ నాన్న తర్వాత సరిపోదా శనివారంతో నాని హ్యాట్రిక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ కలెక్షన్స్‌ను మరో 3, 4 రోజుల్లో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits