Indian Navy Recruitment: ఇండియన్ నేవీ లో సెయిలర్ రిక్రూట్మెంట్; అర్హత ఇంటర్మీడియట్ మాత్రమే..

Best Web Hosting Provider In India 2024


Indian Navy Sailor Recruitment 2024: ఇండియన్ నేవీ సెయిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 17 వరకు..

రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 సెప్టెంబర్ 7న ప్రారంభమై 2024 సెప్టెంబర్ 17న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ నవంబర్ 2024 బ్యాచ్ లో ఎస్ఎస్ఆర్ (మెడికల్ అసిస్టెంట్) కోసం మెడికల్ బ్రాంచ్ లో అభ్యర్థులను భర్తీ చేస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

అర్హత ఇంటర్మీడియట్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (PCB)తో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు నవంబర్ 1, 2003 నుంచి ఏప్రిల్ 30, 2007 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం

ఎస్ఎస్ఆర్ – మెడ్ అసిస్టెంట్ (SSR Medical Asst) 02/2024 బ్యాచ్ ఎంపిక ప్రక్రియలో రెండు స్టేజ్ ల్లో జరుగుతుంది. స్టేజ్ 1 లో 10+2 లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. స్టేజ్ 2 లో పీఎఫ్టీ, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ (ఇండియన్ నేవీ నిర్దేశిత కేంద్రాల్లో) లో సాధించిన మార్కుల ఆధారంగా అర్హులను నిర్ధారిస్తారు. అభ్యర్థులను రాష్ట్రాల వారీగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు గా అభ్యర్థులు రూ.60 + జీఎస్టీ చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లింపులు జరపాలి.

ఎలా అప్లై చేయాలి

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in ను ఓపెన్ చేయాలి.
  • ఇండియన్ నేవీ (Indian Navy) అధికారిక వెబ్సైట్ హోమ్ పేజీలో ఉన్న అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
  • ఈ కోర్సుకు సంబంధించిన ప్రాథమిక శిక్షణ 2024 నవంబర్లో ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024



Source link