Best Web Hosting Provider In India 2024
Adilabad News: గణపతి నిమజ్జనం ఉత్సవాలను ప్రజలు ప్రశాతం వాతావరణంలో జరుపుకోవాలని మల్టిజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పీఎస్‌ను ఐజీ సందర్శించారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి డిఎస్పి లకు సీఐలకు గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మల్టీ జోన్ ఐజి ఎస్. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకున్నందుకు అదే విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.
ఎటువంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తమై అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో విధులను నిర్వర్తిస్తుందని, నిమజ్జన కార్యక్రమానికి 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పట్టణంలో ప్రత్యేకంగా 11 సెక్టార్లను విభజించి ఎస్సై స్థాయి అధికారులను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏడు క్లస్టర్లను విభజించి సిఐ స్థాయి అధికారులతో పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తూ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో, జిల్లా వ్యాప్తంగా 200 సీసీ కెమెరాలనుఏర్పాటు చేయడం జరిగిందని వీడియోగ్రఫీ ద్వారా ప్రత్యక్షంగా 24 గంటలు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 1600గణపతి విగ్రహాల జియో టాగింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్సీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, డి రేందర్ రెడ్డి, ప్రసాద్, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, -రుణాకర్, శ్రీనివాస్, ప్రణయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
డీజేలు, లేజర్ లైట్స్ ప్రమాద కరం…
యువకులు ఉత్సాహంతో నృత్యాలు చేయడం.. ఆరోగ్యకరమే అయినా.. డీజే లు లేజర్ లైట్లు ఎంతో చేటు చేస్తాయని తెలిపారు. లేజర్ లైట్ ల వలన కళ్ళు పోయే ప్రమాదం నెలకొంటుందని సాధ్యమైనంత వేరకు తగ్గించడమే ఉత్తమమని సూచించారు.
నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులకు ఫైర్ క్రాకర్స్, బాణా సంచాలను పేల్చడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రమాద సంభవించే అవకాశం ఉన్నందున వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై పోలీసు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
అదేవిధంగా డీజే ల యజమానులకు పోలీసు పరిమితిని మించి సౌండ్ సిస్టం లను ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఏర్పాటు చేసిన వారి ఓనర్లపై యజమానులపై చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. డీజెలలో ప్రత్యేకంగా లేజర్ లైట్ లను ఉపయోగించకూడదని వాటి వల్ల కళ్ళు పోయి అందత్వం వచ్చే ప్రమాదం ఉన్నందున వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సూచించారు.
పట్టణంలో దాదాపు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం ఈ వీడియోగ్రఫీ నిర్వహిస్తూ, ప్రత్యేకంగా నిమజ్జనం రోజులలో డ్రోన్ కెమెరాలతో నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వైర్ల వద్ద జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
(రిపోర్టింగ్ కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్ జిల్లా)
టాపిక్