Best Web Hosting Provider In India 2024
మాజీ కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు: తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని వైయస్ఆర్‌సీపీ ముందు నుంచి చెబుతుందన్నారు . చంద్రబాబు తన స్వార్థం కోసం తిరుమల లడ్డూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానంకూడా తీవ్రంగా పరిగణించిందన్నారు. శ్యామలరావుతో చంద్రబాబు చిలుక పలుకులు పలికించారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారన్నది ఈ విషయంలో మరోమారు రుజువైంది. బీజేపీ నేత పురంధేశ్వరి డిక్లరేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆమె వ్యాఖ్యలను బీజేపీ పెద్దలు కూడాపట్టించుకోలేదు. వాస్తవాలు వెలుగు చూడాలంటే.. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేంద్రంలోని స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలి. చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి చెందిన అమ్ముడబోయిన బీజేపీ నేతల ఆలోచనలు పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ విచారణ చేపడితే కేంద్ర ప్రభుత్వ తీరును అందరూ హర్షిస్తారు. ఇలా కాకుంటే కేంద్రం కూడా అప్రతిష్టపాలు కావాల్సి వస్తుంది. కేంద్రం ఈ విషయంలో కచ్చితంగా దర్యాప్తు చేపడితే బాగుటుందని ఏపీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైయస్ జగన్ పాత్ర ఇందులో లేదని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ చెప్పారు. ఇవాళ సుప్రీం కోర్టు కూడా ఇదే నిర్ధారించింది. చంద్రబాబు పతనానికి ఈ వ్యవహారం దారితీస్తుంది. వైయస్ జగన్ మొదటి నుంచి ఈ అంశంపై ఆచితూచి మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడింది దారుణమని ప్రజలు గమనించారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.