Hemoglobin foods: రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే ముఖ్యమైన ఆహారాలు ఇవే, ప్రతిరోజు వీటిలో కనీసం రెండైనా తినండి

Best Web Hosting Provider In India 2024

Hemoglobin foods: హిమోగ్లోబిన్… ఎర్ర రక్త కణాల్లో ఉండే ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఇది. హిమోగ్లోబిన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. హిమోగ్లోబిన్ రక్తంలో పుష్కలంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇదే శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ లో రవాణా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ సరిపడా ఉంటేనే మహిళలైనా, పురుషులైనా ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలరు. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే తీవ్రమైన బలహీనత, శ్వాస ఆడక పోవడం, తల తిరగడం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్ అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించాలి.

రక్తహీనత సమస్య

రక్తంలో ఐరన్ తో నిండిన ప్రోటీన్ హిమోగ్లోబిన్. అందుకే హిమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనత సమస్య ఉందని చెబుతారు వైద్యులు. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల గుండెకు కూడా సమస్యలు మొదలవుతాయి. గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. మన దేశంలో 56 శాతం మంది మహిళల్లో రక్తహీనత సమస్య ఉన్నట్టు గుర్తించారు. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి బి విటమిన్లు, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఉన్న ఆహారాలను తినమని సిఫారసు చేస్తున్నారు. కొంతమంది వైద్యులు సప్లిమెంట్లను అందిస్తున్నారు.

హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే కొన్ని రకాల పదార్థాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ వాటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. ప్రతిరోజూ ఇక్కడ మేము చెప్పిన ఆహారాలలో కనీసం రెండింటిని అధికంగా తినేందుకు ప్రయత్నించండి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తాన్ని ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేసే ఆహారాలు

పాలకూర, బీట్రూట్, ఆపిల్స్, పుచ్చకాయ, దానిమ్మ, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, ఎండు ద్రాక్ష వంటివి అధికంగా తింటూ ఉండాలి. విటమిన్ సి నిండుగా ఉండే ఆహారాలను తినడం ద్వారా కూడా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఇందుకోసం నారింజ, స్ట్రాబెర్రీ, బొప్పాయి, టమోటోలు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇక్కడ చెప్పిన ఆహారాల్లో కనీసం రెండు నుంచి ఐదు ఆహారాలను ప్రతి రోజూ తినేందుకు ప్రయత్నించండి. హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోకుండా శరీరానికి సరిపడినంత ఉంటాయి.

రోజుకొక అరటిపండు, గుప్పెడు పల్లీలు, కప్పు ఆకుకూరలు, బ్రకోలి వంటివి కూడా తినేందుకు ప్రయత్నించండి. బీట్రూట్ జ్యూస్ తాగితే త్వరగా రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. లేదా రోజుకొక యాపిల్ తినేందుకు ప్రయత్నించండి. రోజుకో రెండు ఖర్జూరాలు తినడం వల్ల కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. నాలుగు నానబెట్టిన బాదం గింజలు ,రెండు ఎండు ద్రాక్షలు తింటే హిమోగ్లోబిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆహార పదార్థాల్లో వీటిని తిన్నా కూడా మీరు రక్తహీనత బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024