Best Web Hosting Provider In India 2024
Horror OTT: తెలుగు హారర్ మూవీ కళింగ ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలోనూ రిలీజైన ఈ మూవీ వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నది. అక్టోబర్ నెలలో ఆహా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. రెండు ఓటీటీలలో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒకటిగా ఉంది.
డైరెక్టర్ కమ్ హీరో…
కళింగ మూవీలో హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు ధృవవాయు. అతడికి జోడీగా ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించింది. మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 13న థియేటర్ల ద్వారా ఈ చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
కళింగ కథ ఇదే…
కళింగ అనే బ్యాక్‌డ్రాప్‌లో హారర్ థ్రిల్లర్ అంశాలను మేళవించి ధృవవాయు ఈ మూవీని తెరకెక్కించాడు. కళింగ ఊరి పొలిమేరకు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో తిరిగి వచ్చిన దాఖలాలు ఉండవు. పొలిమేరను దాటిన వారు నరమాంస భక్షకులుగా మారిపోతుంటారు. ఆ ఊరికి చెందిన లింగ (ధృవవాయు) సారా కాస్తూ బతుకుతుంటాడు.
పద్దును (ప్రగ్యానయన్) ప్రాణంగా ప్రేమిస్తాడు లింగ. కానీ పద్దు తండ్రి (మురళీధర్‌గౌడ్) మాత్రం వారి ప్రేమను అంగీకరించడు. పద్దుతో ప్రేమ కోసం ఊరిపెద్ద (ఆడుకాలం నరేన్) వద్ద తాకట్టులో ఉన్న తన పొలాన్ని విడిపించుకుంటానని పద్దు తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు లింగ.
లింగపై ఉన్న ద్వేషంతో అతడి పొలం బదులు అడవి దగ్గరలోని తన భూమిని రాసిస్తాడు ఊరిపెద్ద. తమ పొలం కోసం పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన లింగకు, అతడి స్నేహితుడికి ఎలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి? కళింగ రాజు సంపద అడవిలో ఎక్కడ ఉంది? ఆ సంస్థానానికి ఉన్న శాపం ఏమిటి? అసుర భక్షి బారి నుంచి లింగ ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
పెళ్లిచూపులుతో ఎంట్రీ…
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లిచూపులుతో పాటు ఘాజీ ఎటాక్‌లో చిన్న పాత్రలు చేశాడు ధృవవాయు. కళింగ కంటే ముందు కిరోసిన్ మూవీలో హీరోగా నటించాడు. కిరోసిన్ మూవీ కూడా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రగ్యానయన్ కూడా తెలుగులో బద్మాష్గాళ్లకు బంపర్ ఆఫర్, సురాపానం, చక్రవ్యూహంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.