Ragi Munagaku Roti: ఉదయం తినేందుకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రాగి మునగాకు రొట్టె, బరువు తగ్గుతారు ఎంతో ఆరోగ్యం కూడా

Best Web Hosting Provider In India 2024

బ్రేక్ ఫాస్ట్‌లో మీరు తినే ఆహారం ఆ రోజంతా మీరు చురుగ్గా ఉండేలా నిర్ణయిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు. మేము ఇక్కడ మీకు రాగి మునగాకు రొట్టె రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీకే తినాలనిపిస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు అధిక బరువుతో బాధపడుతున్న వారు రాగి మునగాకు రొట్టెను తినేందుకు ప్రయత్నించండి. ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే పోషకాలు కూడా శరీరానికి అందించేందుకు ఇది మొదటి స్థానంలో ఉంటుంది.

రాగి మునగాకు రొట్టె రెసిపీకి కావలసిన పదార్థాలు

రాగి పిండి – రెండు కప్పులు

మునగాకు తరుగు – ఒక కప్పు

నూనె – సరిపడనంత

వేడి నీళ్లు – తగినన్ని

వెల్లుల్లి తరుగు – ఒక స్పూను

ఉల్లిపాయ తరుగు – నాలుగు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

ఎండుమిర్చి – రెండు

రాగి మునగాకు రొట్టె రెసిపీ

1. ఒక గిన్నెలో రాగి పిండిని వేయండి.

2. ఇందులో వెల్లుల్లి తరుగు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి తురుము, ఉల్లిపాయ తురుము, మునగాకు వేసి బాగా కలపండి.

3. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు వేడి నీళ్లు వేసి దాన్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండండి.

4. అరగంట పాటు దాన్ని పక్కన వదిలేయండి.

5. గారెలు చేసేందుకు ఎంత మందంగా పిండిని కలుపుకుంటామో ఈ రాగి మునగాకు రొట్టె కూడా అంతే మందంగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు చేత్తో చిన్న ముద్దను తీసి ఒక స్టీల్ ప్లేట్ కి నూనె రాసి ఆ ముద్దను పెట్టండి.

7. చేతితోనే రొట్టె లాగా ఒత్తుకోండి. చేతికి కూడా నూనె రాసుకుంటే అంటకుండా ఉంటుంది.

8. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయండి చేత్తో ఒత్తుకున్న ఆ రొట్టెను మెల్లగా తీసి పెనం మీద వేసి కాల్చండి.

9. దీని రెండువైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ రాగి మునగాకు రొట్టె రెడీ అయినట్టే.

10. దీన్ని కొబ్బరి పచ్చడితో తింటే రుచి అదిరిపోతుంది.

11. నిజానికి ఎలాంటి పచ్చడి లేకపోయినా కూడా దీన్ని తెలియవచ్చు.

12. కారంపొడిలో ముంచుకొని తిన్నా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ ఇది.

మధుమేహులు దీన్ని హ్యాపీగా ఎంతైనా తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని తినడం వల్ల వారికి రోజంతా ఇతర ఆహారాలు తినాలన్న కోరిక తగ్గుతుంది. తద్వారా మీరు బరువు ఆరోగ్యంగా తగ్గుతారు.

ఇందులో వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ముఖ్యంగా రాగుల్లో ప్రోటీన్, ఫైబర్, అయోడిన్, ఖనిజాలు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. కాబట్టి గ్లూటెన్ లోపంతో బాధపడేవారు. రాగి పిండితో చేసిన ఆహారాలను తింటే మంచిది. ఇక మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువే. మునగాకులో ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. తరచూ మునగాకుని తినమని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. మధుమేహులు మునగాకును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024