Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: శౌర్య కోసం కార్తీక్ కన్నీళ్లు – నిజం తెలుసుకున్న కాంచన – దీప అనుమానం
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 24 ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కు అవసరమైన డబ్బుల కోసం తెలిసిన వారినందరిని అడుగుతాడు కార్తీక్. కానీ అతడికి సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. డబ్బులు అడ్జెస్ట్ కాలేకపోవడంతో కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
Karthika Deepam 2 Serial: శౌర్యను చూడాల్సిందేనని దీప పట్టుపడుతుంది. శౌర్య తన స్నేహితుడి ఇంట్లోనే ఉందని, వారం వరకు రావడం కుదరదని కార్తీక్ అబద్దం ఆడుతాడు. నీకు నమ్మకం లేకపోతే శౌర్యకు కాల్ చేయమని కార్తీక్ తన ఫోన్ దీపకు ఇస్తాడు. శౌర్య చాలా సంతోషంగా భోజనం చేసి పడుకొని ఉంటుందని దీపకు సర్ధిచెబుతాడు.
ట్రీట్‌మెంట్ డబ్బులు…
ఇంట్లో శౌర్య బొమ్మ కనిపించడంతో కూతురు గుర్తొచ్చి దీప ఎమోషనల్ అవుతుంది. హాస్పిటల్ వాళ్లు ఫోన్ చేసి శౌర్య ట్రీట్‌మెంట్‌కు డబ్బులు కట్టమని అడుగుతారు. లేదంటే ట్రీట్‌మెంట్ ఆపేస్తామని అంటారు. హాస్పిటల్ వాళ్లతో కార్తీక్ మాట్లాడటం దీప వింటుంది. డబ్బులు ఎవరికి కట్టాలని అడుగుతుంది. తాతతో ఛాలెంజ్‌లో గెలిచేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నానని, నేను పెట్టుకున్న సంకల్పం శక్తికి మించినదని, ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకోవాలని కార్తీక్ అంటాడు. ఎవరిని అని దీప అడుగుతుంది. నా సంకల్పాన్ని కార్తీక్ అబద్ధం చెబుతాడు. లక్ష సమస్యలు కానీ అన్నింటికి డబ్బే కావాలని కార్తీక్ అంటాడు.
నువ్వు వేరు…నేను వేరు కాదు…
నేను మీకు సాయం చేస్తానని కార్తీక్‌తో దీప అంటుంది. నేను వేరు, నువ్వు వేరు అనుకుంటే నీ సాయం కోసం ఎదురుచూస్తా. మనం ఇద్దరం ఒక్కటే. ఈ సంకల్పాన్ని కాపాడుకునే బాధ్యత ఇద్దరిది. నువ్వు అడుగుపెట్టడానికి కొంత టైమ్ ఉంది. అప్పటివరకు తనను వదిలేయమని దీపతో చెబుతాడు కార్తీక్.
అనసూయ అనుమానం…
కార్తీక్ మాటలు విని అనసూయలో అనుమానం మొదలవుతుంది. శౌర్యకు ఎలా ఉందని కార్తీక్‌ను అడుగుతుంది. శౌర్య విషయంలో నేను ఏమైనా మీకు సాయపడగలనా అని అంటుంది. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతానని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. శౌర్యకు ఏం జరిగిందో దీప తెలుసుకోవాలని అనుకుంటుంది. అడుగడుగునా అబద్దాలు చెప్పాల్సివస్తుందని, మీరే దీపకు ధైర్యం చెప్పాలని అనసూయతో అంటాడు కార్తీక్.
తాకట్టు ఉంటేనే….
డబ్బుల కోసం ఫైనాన్షియర్ దగ్గరకు వస్తాడు కార్తీక్. తాకట్టు పెట్టడానికి కార్తీక్ దగ్గర ఏం లేకపోవడంతో ఫైనాన్షియర్ డబ్బులు ఇవ్వడు. ఫైనాన్షియర్‌ను బతిమిలాడుతాడు. కార్తీక్ మాటల్ని అతడు పట్టించుకోడు. తనకు తెలిసిన వారినందరిని డబ్బులు అడుగుతాడు అంత డబ్బు ఇవ్వలేమని అందరూ చెబుతారు. కొందరు కార్తీక్‌కు కసురుకుంటారు.
తల్లిదండ్రుల ఫొటోపై చేయి వేసి శౌర్య పడుకొని ఉంటుంది. కూతురిని చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నేను నిన్ను కాపాడుకుంటానని అంటాడు. డబ్బుల కోసం తన ప్రయత్నాలు అపోద్దని నిర్ణయించుకుంటాడు.
పసి ప్రాణం విలువ…
శౌర్యతో హాస్పిటల్‌లోనే ఉండాలని కాశీ అనుకుంటాడు. దాసు బాగోగుల్ని స్వప్నకు అప్పగించి నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదని కాశీని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. డబ్బు అడ్జెస్ట్ కాకపోవడంతో ఏం చేయాలో కార్తీక్‌కు అర్థం కాదు. ఒకప్పుడు యాభై లక్షలు తనకు చిన్న ఎమౌంట్ అని, కానీ ఇప్పుడు నాకు దక్కని డబ్బు విలువ ఒక పసి ప్రాణం అని అనుకుంటాడు. శౌర్యను ఎలా బతికించుకోవాలని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నిజాల్ని దాస్తూ…
కార్తీక్ ఇంటికి రాకపోవడంతో కాంచన కంగారు పడుతుంది. రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయని, ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదని అంటుంది. కాంచన, అనసూయ బయటకు వస్తారు. చీకట్లో ఒంటరిగా కూర్చొని కార్తీక్ కనిపిస్తాడు. ఇప్పుడు శౌర్య ఏ హాస్పిటల్‌లో ఉందని కొడుకును అడుగుతుంది కాంచన. నిజాల్ని దాస్తూ నీలో నువ్వు నలిగిపోయిందని చాలని, అసలు శౌర్యకు ఏమైంది అని అడుగుతుంది.
హాస్పిటల్‌లో చేర్పించా…
తల్లి మాటలు వినగానే కార్తీక్ కన్నీళ్లు ఆపుకోలేకపోతాడు. తల్లి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తాడు. కార్తీక్ కన్నీళ్లు చూసి కాంచన, అనసూయ భయపడిపోతారు. శౌర్యకు ఆపరేషన్ చేయాలని, లేదంటే బతకదని డాక్టర్లు అన్నారని కార్తీక్ నిజం బయటపెడతాడు. శౌర్య అనారోగ్యం గురించి మీకు, దీపకు తెలిస్తే తట్టుకోలేరని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళుతున్నానని అబద్దం చెప్పి హాస్పిటల్‌లో చేర్పించానని కార్తీక్ అంటాడు.
యాభై లక్షలు కావాలి…
శౌర్య ఆపరేషన్‌కు యాభై లక్షలు కావాలని, కానీ డబ్బులు ఎక్కడ దొరకడం లేదని కార్తీక్ చెబుతాడు. ఎవరు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వడం లేదని, ఏం చేయాలో అర్థం కావడం కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. జీవితంలో మొదటిసారి ఒక వ్యక్తి నమ్మకాన్ని నిలబెట్టుకోలేమోనని భయంగా ఉందని కార్తీక్ అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అంత డబ్బు ఎవరిస్తారని, కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం నన్ను నేను తాకట్టు పెట్టుకోవడం తప్ప తన దగ్గర ఏం లేదని కార్తీక్ అంటాడు. శౌర్య గురించి దీపకు చెప్పొద్దని కార్తీక్ అంటోండగా అక్కడికి దీప ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే మాటలు ఆపేస్తాడు.
సీక్రెట్స్ లేవు…
శౌర్య గురించిన నిజం దీపకు తెలిసిపోయిందని కార్తీక్ కంగారు పడతాడు. నన్ను చూసి మాటలు ఎందుకు ఆపేశారు. ఏం మాట్లాడుకుంటున్నారని భర్తను అడుగుతుంది. నిన్ను చూసి మాటలు ఆపేంత సీక్రెట్స్ ఏం లేవని, కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నామని కవర్ చేస్తాడు.
తిండి తిప్పలు మాని…
శౌర్య దగ్గరకు తీసుకెళ్లమని అంటే రెండు రోజులుగా కార్తీక్ తనను పట్టించుకోనట్లే తిరుగుతున్నాడని దీప అంటుంది. డబ్బుల కోసం కార్తీక్ తిండి తిప్పలు మానేసి ఎందుకు తిరుగుతున్నాడో, శౌర్యను ఫ్రెండ్ ఇంట్లో ఎందుకు ఉంచాడో ఏం చెప్పడం లేదని దీప అంటుంది. ఏం జరగలేదని చెప్పి కార్తీక్ ఇంట్లోకి వెళ్లిపోతాడు. శౌర్య గురించిన నిజం కాంచన, అనసూయ దీప దగ్గర దాచేస్తారు. శౌర్య ప్రాణాలను కాపడటానికి తానే ఒకటి చేయబోతున్నట్లు కాంచన చెబుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.