OTT: మ‌ల‌యాళం, త‌మిళ సినిమా ల‌వ‌ర్స్ కోసం స్పెష‌ల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే! – స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు త‌క్కువే!

Best Web Hosting Provider In India 2024

OTT: మ‌ల‌యాళం, త‌మిళ సినిమా ల‌వ‌ర్స్ కోసం స్పెష‌ల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే! – స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు త‌క్కువే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 29, 2025 02:41 PM IST

OTT: మ‌ల‌యాళ‌, త‌మిళం సినిమాలు మాత్ర‌మే చూడ‌టానికి స్పెష‌ల్‌గా కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. త‌క్కువ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీల‌తో ఈ ఓటీటీల‌లో మ‌ల‌యాళం, త‌మిళ సూప‌ర్ హిట్ సినిమాల‌ను చూడొచ్చు. ఆ ఓటీటీలు ఏవంటే?

ఓటీటీ
ఓటీటీ

OTT: ఓటీటీ ట్రెండ్ కార‌ణంగా మ‌ల‌యాళం, త‌మిళ సినిమాల‌కు క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఓటీటీల‌లో మ‌ల‌యాళం, త‌మిళ‌ సినిమాలు మిలియ‌న్ల‌లో వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కార‌ణంగానే ప‌లువురు మ‌ల‌యాళ‌, త‌మిళ ఆర్టిస్టులు తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల ఆడియెన్స్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌…

త‌మిళ మ‌ల‌యాళ సినిమాలు ఎక్కువ‌గా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ హాట్ స్టార్‌ల‌లో స్ట్రీమింగ్ అవుతోంటాయి. ఇవే కాకుండా సోనీలీవ్‌, స‌న్ నెక్స్ట్స్ ఓటీటీల‌లో ఈ భాష‌ల‌కు చెందిన సినిమాల‌ను చూడొచ్చు. ఈ ఓటీటీల‌లో అన్ని భాష‌ల‌కు చెందిన సినిమాలు క‌నిపిస్తుంటాయి.

అలా కాకుండా కేవ‌లం మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల కోస‌మే ప్ర‌త్యేకంగా కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. త‌క్కువ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీల‌తోనే అందుబాటులో ఉన్న ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవంటే?

మ‌నోర‌మా మ్యాక్స్‌

మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో కేవ‌లం మ‌ల‌యాళ సినిమాలు మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతుంటాయి. సినిమాలే కాకుండా మ‌ల‌యాళ భాష‌కు చెందిన వెబ్‌సిరీస్‌లు, టీవీ షోస్‌ను ఈ ఓటీటీలో స్క్రీనింగ్ అవుతుంటాయి. థ్రిల్ల‌ర్, యాక్ష‌న్‌, రొమాన్స్‌తో పాటు ప‌లు జాన‌ర్స్‌కు చెందిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఈ సినిమాలు ఈ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు ఏడాదికి 899 రూపాయ‌లుగా ఉన్నాయి.

సైనా ప్లే ఓటీటీ

సైనా ప్లే ఓటీటీలో కూడా కేవ‌లం మాల‌యాళ సినిమాలు మాత్ర‌మే చూడొచ్చు. 1980, 90 కాలం నుంచి కొత్త సినిమాల వ‌ర‌కు ప‌లు మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఈ మూవీస్ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. సైనా ప్లే ఓటీటీ ఏడాది ప్లాన్ 699 ఉండ‌గా…నెల ఛార్జీలు 99గా ఉన్నాయి.

టెంట్ కోటా ఓటీటీ

ఓవ‌ర్‌సీస్‌లో పాపుల‌ర్ అయిన టెంట్ కోటా ఓటీటీ ప్లాట్‌పామ్ ఇటీవ‌లే ఇండియాలోకి ఎంట‌రైంది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త‌మిళ భాష‌కు చెందిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఏడాదికి 468 రూపాయ‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీల‌తో (నెల‌కు 36 రూపాయ‌లు) 4కే క్వాలిటీతో ఈ ఓటీటీలో సినిమాలు చూడొచ్చు. 1960 టైమ్ నుంచి 2025 వ‌ర‌కు వ‌చ్చిన ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌మిళ సినిమాలు ఈ ఓటీటీలో ఉన్నాయి.

ఓటీటీ ప్ల‌స్ నెల‌కు 29 రూపాయ‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో త‌మిళ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌ను చూడొచ్చు

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024