Best Web Hosting Provider In India 2024

Thandel Director: రాజమౌళి ఫొటో మా ఇంట్లో దేవుళ్ల ఫొటోల పక్కనే ఉంటుంది: Thandel డైరెక్టర్ కామెంట్స్ వైరల్
Thandel Director: రాజమౌళిని దేవుడిగా ఆరాధించే వాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు. తాజాగా Thandel డైరెక్టర్ చందూ మొండేటి కూడా జక్కన్నపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అతని ఫొటో తమ ఇంట్లో దేవుళ్ల పటాల పక్కనే ఉంటుందని చెప్పాడు. రాజమౌళితోపాటు శంకర్, మణిరత్నం, సుకుమార్ అంటే తనకు ఎంతో ఇష్టమని చందూ చెప్పాడు.
రాజమౌళి ఫొటోపై చందూ మొండేటి
కార్తికేయ, కార్తికేయ 2, సవ్యసాచిలాంటి సినిమాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి.. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ మూవీ తీశాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉంది.
ఇందులో భాగంగా గలాటా తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడాడు. రాజమౌళి, శంకర్, మణిరత్నం, సుకుమార్ లు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమని, వాళ్లు లేకపోతే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడినే కాదని అతడు అనడం గమనార్హం.
తండేల్ మూవీ చందూ మొండేటికి ఓ రోజా అవుతుందా అని ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు అతడు ఇలా స్పందించాడు. “నేను అంతటి డైరెక్టర్ తో పోల్చుకోలేను. నా వరకు మణిరత్నం, రాజమౌళి, శంకర్ లాంటి వాళ్లు.. వాళ్ల పేర్లు వింటేనే నాకు వణుకొస్తుంది.మీరు నమ్ముతారో నమ్మరోగానీ రాజమౌళి గారి ఫొటో మా ఇంట్లో దేవుడి పటాల పక్కనే ఉంటుంది.
ఓవైపు కృష్ణుడు, మరోవైపు శివుడు.. ఇలా రాజమౌళితోపాటు మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్ల ఫొటోలు ఉంటాయి. వాళ్లంటే నాకు అంత ఇష్టం. రాజమౌళి ఫొటో ఇప్పుడు కాదు.. మగధీర మూవీ సమయం నుంచే మా ఇంట్లో ఉంది. వాళ్లతోపాటు సుకుమార్ లాంటి డైరెక్టర్ అంటే నాకు చాలా గౌరవం. వాళ్లు లేకుండా నేనీ రోజు ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు” అని అనడం విశేషం.
తండేల్ మూవీ గురించి..
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఇందులో చైతన్య ఓ మత్స్యకారుడి పాత్రలో కనిపించనుండటం విశేషం. పాకిస్థాన్ బోర్డర్ దగ్గరికి వెళ్లి అనుకోకుండా ఆ దేశ నేవీకి చిక్కిన మన మత్స్యకారుల చుట్టూ తిరిగే కథ ఇది. ప్రేమ కథకు దేశభక్తిని జోడించి తెరకెక్కించారు.
ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద ప్లస్ కానుంది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్ కాగా.. ఇప్పటి వరకూ రిలీజైన మూడు పాటలకు కలిపి 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
సంబంధిత కథనం