New Osmania Hospital : రూ.2,700 కోట్ల వ్యయంతో నిర్మాణం – కొత్త ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ భూమిపూజ, ప్రత్యేకతలివే

Best Web Hosting Provider In India 2024

New Osmania Hospital : రూ.2,700 కోట్ల వ్యయంతో నిర్మాణం – కొత్త ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ భూమిపూజ, ప్రత్యేకతలివే

Maheshwaram Mahendra HT Telugu Jan 31, 2025 12:46 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 31, 2025 12:46 PM IST

కొత్త ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. గోషామహల్‌ స్టేడియంలో ఆధునిక హంగులతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నెలకొననుంది. భూమి పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.

కొత్త ఉస్మానియా ఆస్పత్రికి భూమిపూజ
కొత్త ఉస్మానియా ఆస్పత్రికి భూమిపూజ
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆస్పత్రికి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. గోషామహల్‌ స్టేడియం వేదికగా ఆధునిక హంగులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే డిజైన్ ఖరారైంది.

yearly horoscope entry point

స్టాఫ్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తారు. రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో 32 లక్షల చదరపు అడుగుల మేర భవనాలు ఉంటాయి. మొత్తం 8 బ్లాకులు, 14 అంతస్తుల్లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.

మరికొన్ని వివరాలు….

  • వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు పాత ఉస్మానియా ఆసుప‌త్రి ద్వారా సేవలు అందాయి. నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించటంతో… శుక్రవారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు.
  • ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రి అఫ్జ‌ల్‌గంజ్‌లో ఉండ‌గా.. కొత్త ఆసుపత్రిని గోషామ‌హ‌ల్ స్టేడియంలో నిర్మించ‌నున్నారు.
  • 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో మొత్తం 32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నూత‌న ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు.
  • 26 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ‌నున్న ఉస్మానియా ఆసుప‌త్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా ఉండాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
  • రాబోయే వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఉస్మానియా ఆసుప‌త్రిని నిర్మించాల‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి.
  • ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.
  • అండ‌ర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్ల‌లో పార్కింగ్‌ ఉంటుంది. ఆసుప‌త్రి స‌మీపంలో ఫైర్ స్టేష‌న్‌, ఆసుప‌త్రి చుట్టూ విశాల‌మైన ర‌హ‌దారులు, ఆసుప‌త్రి ప్రాంగంణంలో ఎక్క‌డికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుప‌త్రిలోకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు నిర్మిస్తారు.
  • ఆసుప‌త్రిలోని రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే వారు సేద తీరేందుకు డార్మెట‌రీలు, క్యాంటీన్‌, మ‌రుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించ‌నున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCm Revanth ReddyHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024