ఈ పప్పును మాంసాహారంతో సమానంగా ఎందుకు చూస్తారు? ఇది తింటే మాంసాహారం తిన్నట్టే అని ఎందుకు భావిస్తారు?

Best Web Hosting Provider In India 2024

ఈ పప్పును మాంసాహారంతో సమానంగా ఎందుకు చూస్తారు? ఇది తింటే మాంసాహారం తిన్నట్టే అని ఎందుకు భావిస్తారు?

Haritha Chappa HT Telugu
Jan 31, 2025 05:30 PM IST

పప్పు దినుసులు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో మసూర్ పప్పు ఒకటి. ఇది ఒక రకమైన కందిపప్పు. చూడటానికి ఎర్రగా ఉంటుంది. కానీ దీన్ని మాంసాహారంగా భావిస్తారు ఎంతోమంది.

ఏ పప్పును మాంసాహారంగా భావిస్తారు?
ఏ పప్పును మాంసాహారంగా భావిస్తారు? (spicebangla)

మసూర్ పప్పును మనం ఎర్ర కందిపప్పు అని పిలుచుకుంటాము. దీన్ని కూడా అధికంగానే తింటూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన పప్పు దినుసే. అయితే కొన్ని కులాల వారు, బెంగాలీలు ఈ మసూర్ పప్పును మాంసాహారంగా భావిస్తారు. దీన్ని తింటే మాంసాహారం తిన్నట్టే అనుకుంటారు. అందుకే కొంతమంది ఈ పప్పును తినరు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో ఈ మసూరు పప్పును పూర్తి మాంసాహార జాబితాలో కలిపేశారు. ఇలా ఎందుకు చేశారో తెలుసుకోండి. మసూర్ పప్పుకు మహాభారతానికి కూడా ఒక అనుబంధం ఉన్నట్టు బెంగాలీలో చెప్పుకుంటారు.

yearly horoscope entry point

మసూర్ దాల్ పప్పు వెనుక కథ

పశ్చిమ బెంగాల్‌లో మసూర్ పప్పును మాంసాహారంగా భావించడానికి ఒక కారణం చెప్పుకుంటూ ఉంటారు. సహస్రబాహు అర్జునుడు అని పిలిచే రాజు జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువును దొంగిలిస్తాడు. ఆ కామధేనువును రాజు బలవంతంగా ఈడ్చుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆవుకు గాయాలు తగిలి రక్తస్రావం అవుతుంది. ఆ రక్త బిందువులు ఎక్కడైతే కింద పడుతూ ఉంటాయో అక్కడ నుంచి ఈ మసూర్ పప్పు మొక్కలు పుట్టుకొస్తాయని చెప్పుకుంటారు. అందుకే దీన్ని శాఖాహారంగా కాకుండా మాంసాహారంగా బెంగాలీ సంస్కృతిలో చూడడం ప్రారంభించారు.

ఇక ఈ పప్పు చరిత్రను పరిశీలిస్తే ఈ ఎర్ర కందిపప్పును క్రీస్తుపూర్వం 2000లో ఈజిప్టులో మొదటిసారి పండించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. మసూర్ అనే పేరు ఈజిప్షియన్ పదమైన మిశ్రా నుండి ఉద్భవించిందని అంటారు. ఈజిప్టులో వీటిని అధికంగా తినేవారని, తర్వాత అన్ని దేశాలకు ఇది చేరిందని చెప్పుకుంటారు. అలా భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిందని చెప్పుకుంటారు. మొఘలులు ఈ మసూర్ పప్పును అధికంగా తినేవారని అంటారు.

బెంగాల్‌లో మసూర్ పప్పును తినకపోవడానికి ఇతర కారణాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ పప్పులో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండేది మాంసాహారంలోనే అని వారు నమ్ముతారు. అయితే అక్కడ ఉండే వితంతువులు శాఖాహారాన్ని మాత్రమే భుజిస్తారు. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి కూడా తినరు. చివరికి వారు మసూరు పప్పును కూడా తినరు. వీటిలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ వారిలో హార్మోన్లను ప్రేరేపిస్తుందని దానివల్ల లైంగిక ఆసక్తులు కలిగేలా చేస్తుందని వారి నమ్మకం. అలాంటి కోరికలు వితంతువులకు రాకూడదని వారు నమ్ముతారు. అందుకే మసూర్ దాల్‌ను వితంతువులు తినకుండా అడ్డుకున్నారు. అలాగే అక్కడ ఉన్న శాఖాహారాన్ని తినే కులాలు వారు కూడా మసూర్ పప్పును పూర్తి మాంసాహారంగా భావించి నిషేధించారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మసూర్ పప్పును శాఖాహారంగానే భావిస్తారు. దాన్ని తినేందుకు ఇష్టపడతారు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మసూర్ దాల్ తింటే చికెన్, కోడిగుడ్లు తిన్నంత ప్రోటీన్ శరీరంలో చేరుతుంది. సైన్స్ ప్రకారం మసూర్ దాల్ పూర్తిగా శాకాహారం. మొక్కల ఆధారిత ఆహారం.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024