


Best Web Hosting Provider In India 2024

Shivaratri Wishes: ఈ మహా శివరాత్రికి అందమైన శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా పంపించండి
Shivaratri Wishes: మహా శివరాత్రి పరమ పవిత్రమైన పండుగగా హిందువులు నిర్వహించుకుంటారు. ఈ పండుగ రోజు తమ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ మేము మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుగులో ఇచ్చాము. మీకు నచ్చిన మెసేజ్ ను ఎంపిక చేసుకొని మీ మిత్రులకు పంపించండి.
మహాశివరాత్రి శుభాకాంక్షలు (Pixabay)
మహాశివరాత్రి శుభాకాంక్షలు కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము తెలుగులో శివరాత్రి శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిలో మీకు నచ్చిన శుభాకాంక్షలు ఎంపిక చేసుకొని మీ బంధుమిత్రులకు పంపించండి. వాట్సాప్‌లో, ఫోన్లో, మెసేజ్‌ల రూపంలో, ఫేస్ బుక్‌లో ఇలా అన్నింట్లోనూ వీటిని పంపించవచ్చు. దేవాది దేవుడైన ఆ మహాశివుడు మహిమాన్వితమైన పండుగ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజు శివుని చాలీసాను చదవడం, శివదీక్షలో ఉండడం, శివ అష్టోత్తర శతనామావళి పాటించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు. ఈ మహా శివరాత్రిని మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా నిర్వహించుకోవాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మహాశివరాత్రి శుభాకాంక్షలు
1. శివుడు లోక క్షేమం కోసం తపిస్తాడు.
ఏ మంచి పని అయినా దీక్షతో చేస్తే
ఆ పని విజయవంతం అవుతుంది.
ఈ విషయాన్ని శివతత్వం కూడా బోధిస్తోంది.
ఈ శివరాత్రి నాడు మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు
2. తనువులోని మలినాలను తొలగించి
ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఉపవాసం.
మనసులోని రాజస, తామస గుణాలను రూపుమాపి
సాత్వికం కలిగించేది జాగరణం.
ఆత్మను పరమాత్మలో మిళితమయ్యేలా చేసి
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేసేది ధ్యానం.
ఈ మూడు ధర్మాలను విధిగా పాటించి
సుఖశాంతులతో వర్ధిల్లమని చెప్పే పర్వదినమే మహాశివరాత్రి.
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
3. పరమేశ్వరుని అనుగ్రహం
మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
4. మూడు జగాలను కాసే ముక్కంటి
కంఠంలో గరళాన్ని దాచి అమృతాన్ని పంచే నీలకంఠుడు
అడగ్గానే వరాలిచ్చే భోళా శంకరుడు.. ఆ మహాశివుడు.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
5. మీ కుటుంబ సభ్యులందరికీ
ఆ మహాశివుని ఆశీస్సులు మెండుగా
కలగాలని ఆశిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు
6. ఆ పరమశివుడు మీకు ఆరోగ్యం, సంపద, శ్రేయస్సును
ప్రసాదించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
మహాశివరాత్రి శుభాకాంక్షలు
7. మహాశివరాత్రి సందర్భంగా
శివుని దివ్యశక్తి మీతో రక్షగా ఉండాలని కోరుకుంటూ
మీరు ఆనందంగా పండుగ నిర్వహించగా నిర్వహించుకోవాలని ఆశిస్తూ
శివరాత్రి శుభాకాంక్షలు
8. మహాశివరాత్రి పర్వదినాన
మీ జీవితం ఆనందంగా ఉండాలని,
అనుకున్న పనులు నెరవేరాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు
9. సర్వశక్తివంతుడైన శివుడు
మీ కుటుంబానికి రక్షగా నిలవాలని
ఎల్లవేళలా మీకు విజయాలను అందించాలని కోరుకుంటూ
మహాశివరాత్రి శుభాకాంక్షలు
10. జ్ఞానం, సంతోషం, ప్రశాంతమైన జీవితం
ఆ శివుడు మీకు ఇవ్వాలని
మీ ఇంట్లో శాంతి నెలకొనాలని కోరుకుంటూ
హ్యాపీ మహాశివరాత్రి
11. మహాశివరాత్రి గొప్ప పర్వదినం
శివుని విలువలను అర్థం చేసుకుంటూ
జీవితాన్ని గడపాలని ఆశిస్తూ
మహాశివరాత్రి శుభాకాంక్షలు
12. మహాశివా… ప్రపంచంలోని ప్రజలందరి కోసం
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను
అందరికీ ఆనందం, శాంతి, చిరునవ్వును ఇవ్వండి
ఓం నమ:శివాయ
13. ఆ పరమశివుడు మీ బలాలను మీకు గుర్తు చేసి
మీ లక్ష్యాలను సాధించడానికి జీవితంలో మిమ్మల్ని ప్రేరేపించాలని కోరుకుంటూ
మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
14. ఈ శుభ శివరాత్రి సందర్భంగా
మీ చుట్టూ అలుముకున్న చీకటి, సమస్యలు పోయి
మీ జీవితం సానుకూలతతో నిండాలని నేను కోరుకుంటున్నాను
మహాశివరాత్రి సందర్భంగా
మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు
15. మీ జీవితంలోని చెడు సమయాల్లో
మిమ్మల్ని ముందుకు నడిపించడానికి
శివుడు ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటాడు
మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
16. శివుని దివ్య శక్తి మీ జీవితంలో సానుకూలతను తీసుకురావాలని
ఎల్లప్పుడూ కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు
17. శివుడు మీపై, మీ కుటుంబంపై
తన ఆశీర్వాదాలను కురిపించాలని
మీకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ
మహాశివరాత్రి శుభాకాంక్షలు
సంబంధిత కథనం