Ramadan 2025: పవిత్ర రంజాన్ మాసంలో నగరాల వారీగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాలు ఇవిగో

Best Web Hosting Provider In India 2024

Ramadan 2025: పవిత్ర రంజాన్ మాసంలో నగరాల వారీగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాలు ఇవిగో

Haritha Chappa HT Telugu
Feb 25, 2025 06:30 PM IST

Ramadan 2025: రంజాన్ మాసం మొదలవ్వబోతోంది. ఢిల్లీ, ముంబై, లక్నో, హైదరాబాద్ ఇలా నగరాల వారీగా రంజాన్ సమయాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. రంజాన్ మాసంలో సెహ్రీ, ఇఫ్తార్ సమయాలను తెలుసుకోండి.

నగరాల వారీగా రంజాన్ సమయాలు
నగరాల వారీగా రంజాన్ సమయాలు (Pixabay)

రంజాన్ పండుగ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఎదురు చూస్తున్నారు. ఉపవాసం, ప్రార్థన, ఆధ్యాత్మిక ధ్యానం కోసం అంకితం చేసిన పవిత్రమైన నెల ఇది. శతాబ్దాలుగా ఉన్న ఈ సంప్రదాయం నెలవంక దర్శనంతో ప్రారంభమవుతుంది. ఇది లోతైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

రంజాన్ లో ఉపవాసం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆహారం, పానీయాలను తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. ఇది ఆత్మ నిగ్రహం, దానధర్మాలు చేయడం, సామాజిక అనుబంధాలను పెంచుకోవడం కూడా రంజాన్ లో భాగమే. కుటుంబాలు, స్నేహితులతో కలిసి ప్రతిరోజూ తెల్లవారుజామున సహ్రీ అనే భోజనాన్ని తింటారు. ఆ తరువాత తిరిగి సూర్యాస్తమయం వరకు ఏమీ తినరు. సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ తో ప్రతిరోజూ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇఫ్తార్ ను కూడా ఎవరింట్లో వారు కాకుండా సమూహంగా ఎంతో మందితో కలిసి తింటారు.

రంజాన్ షెడ్యూల్

రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఒక షెడ్యూల్ ప్రకారం అన్నీ జరుగుతాయి. ఉపవాసం, ప్రార్థనలు, ధ్యానం ఇలా రోజువారీ షెడ్యూల్ ద్వారా భక్తులకు మార్గనిర్దేశం జరుగుతుంది. రంజాన్ ను పాటిస్తున్న లక్షలాది మందికి, ఈ షెడ్యూల్ పాటించడం వలల్ ఆధ్యాత్మిక క్రమశిక్షణ వస్తుంది. ఇది సహ్రీ, ఇఫ్తార్‌ను సరైన సమయాల్లో పాటించేలా చూస్తుంది. వివిధ సంస్కృతులు, నేపథ్యాల నుండి వచ్చిన ముస్లింలు ఒకే ఆచారాన్ని అనుసరిస్తారు.

2025లో రమజాన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

రంజాన్ నెలవంక కనిపించడంతో మొదలయ్యే పండుగ. ఈ ఏడాది, సౌదీ అరేబియా, మధ్యప్రాచ్య దేశాలు, అలాగే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఫిబ్రవరి 28 శుక్రవారం నాడు చంద్రుడిని చూస్తారు. ఆ సాయంత్రం చంద్రుడు కనిపిస్తే, రంజాన్ అధికారికంగా మార్చి 01 శనివారం ప్రారంభమవుతుంది. ఆరోజు నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. చంద్రుడు కనిపించకపోతే, నెల మార్చి 02 సోమవారం ప్రారంభమవుతుంది.

భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దక్షిణ ఆసియా దేశాలు మార్చి 01న అంటే శనివారం రంజాన్ చంద్రుని కోసం చూస్తాయి. కనిపిస్తే, ఉపవాసం మార్చి 02 ఆదివారం ప్రారంభమవుతుంది. లేకపోతే, అది మార్చి 03 సోమవారం ప్రారంభమవుతుంది.

ప్రారంభ తేదీ దేశాల ప్రకారం మారవచ్చు. రంజాన్ నెల ఆధ్యాత్మిక మాసం. దీనిలో దయ, ఉదారత, ఆత్మ నిగ్రహం వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి.

రంజాన్ నగరాల వారీగా సహ్రీ ఇఫ్తార్ సమయాలు

1. న్యూఢిల్లీ

ఢిల్లీ రంజాన్ సమయాలు
ఢిల్లీ రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

2. లక్నో

లక్నో రంజాన్ సమయాలు
లక్నో రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

3. ముంబై

ముంబై రంజాన్ సమయాలు
ముంబై రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

4. హైదరాబాద్

హైదరాబాద్ రంజాన్ సమయాలు
హైదరాబాద్ రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

5. అహ్మదాబాద్

అహ్మదాబాద్ రంజాన్ సమయాలు
అహ్మదాబాద్ రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

6. సూరత్

సూరత్ రంజాన్ సమయాలు
సూరత్ రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

7. పూణే

పుణె రంజాన్ సమయాలు
పుణె రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

8. బెంగళూరు

బెంగళూరు రంజాన్ సమయాలు
బెంగళూరు రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

9. చెన్నై

చెన్నై రంజాన్ సమయాలు
చెన్నై రంజాన్ సమయాలు (Image by IslamicFinder)

10. కోల్‌కతా

కోల్ కతా రంజాన్ టైమ్ టేబుల్
కోల్ కతా రంజాన్ టైమ్ టేబుల్ (Image by IslamicFinder)
Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024