Criticism On PCB: వర్షం వస్తే స్డేడియాన్ని కవర్ చేయలేరా? ఐసీసీ డబ్బులు ఏం చేశారు? పీసీబీ సిగ్గుచేటు.. కైఫ్ ఆగ్రహం

Best Web Hosting Provider In India 2024


Criticism On PCB: వర్షం వస్తే స్డేడియాన్ని కవర్ చేయలేరా? ఐసీసీ డబ్బులు ఏం చేశారు? పీసీబీ సిగ్గుచేటు.. కైఫ్ ఆగ్రహం

Chandu Shanigarapu HT Telugu
Feb 25, 2025 07:44 PM IST

Criticism On PCB: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షంతో రద్దయింది. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పలేకపోవడంతో పీసీబీపై విమర్శలు వస్తున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పీసీబీపై మాటలతో రెచ్చిపోయాడు.

రావల్పిండి మైదానాన్ని పూర్తిగా కవర్ చేయలేకపోయిన పాకిస్థాన్
రావల్పిండి మైదానాన్ని పూర్తిగా కవర్ చేయలేకపోయిన పాకిస్థాన్ (AFP)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షంతో రద్దయింది. రావల్పిండి స్టేడియంలో మంగళవారం (ఫిబ్రవరి 25) జరగాల్సిన మ్యాచ్ ను వరుణుడు తుడిచిపెట్టేశాడు. ఒకవేళ వర్షం తగ్గినా కటాఫ్ టైం లో మైదానాన్ని ఆటకు సిద్ధం చేసే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దుచేశారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు.

ఏం చేశారు?

రావల్పిండి స్టేడియంలో వర్షం పడుతున్నా గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం పిచ్, దాని చుట్టుపక్కలా కవర్లు పరిచారు. మిగతా గ్రౌండ్ మొత్తం వదిలేశారు.

‘‘రావల్పిండి గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేయకపోవడం సిగ్గుచేటు. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా ఓ ముఖ్యమైన మ్యాచ్. ఈ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ఐసీసీ డబ్బును ఆతిథ్య దేశం తెలివిగా ఉపయోగించిందా?’’ అని ఎక్స్ లో కైఫ్ పోస్టు చేశాడు.

రూ.385 కోట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాకిస్థాన్ కు ఐసీసీ సుమారు రూ.385 కోట్ల బడ్జెట్ కేటాయించిందని సమాచారం. ఇది కాకుండా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహిస్తున్నందుకు అదనంగా రూ.38.2 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ కోసం కరాచి, లాహోర్, రావల్పిండి స్టేడియాలను పీసీబీ రినోవేట్ చేసింది. టోర్నీ ఆరంభ సమయం దగ్గర పడ్డా ఈ స్టేడియాల రిపేర్లు పూర్తి కాకపోవడంతో ఆందోళన రేకెత్తింది.

పీసీబీపై విమర్శలు

29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఓ వైపు సొంత జట్టు టోర్నీ నుంచి త్వరగానే నిష్క్రమించనుంది. ఇంకో వైపు నిర్వహణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వర్షంతో మ్యాచ్ రద్దవడం పీసీబీని మరింత చిక్కుల్లో పడేసింది. స్టేడియం మొత్తం కవర్లతో నింపకుండా ఎందుకు వదిలేశారు? ఐసీసీ డబ్బులు ఏం చేశారు? అనే విమర్శలు వస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link