Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: నాగార్జునను కలిసిన మనోజ్- ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి- కొట్టుకున్న అన్నదమ్ములు
Gunde Ninda Gudi Gantalu Serial February 27th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో మనోజ్ పార్క్ నాటకాన్ని ఇంట్లో బట్టబయలు చేస్తాడు బాలు. దాంతో రోహిణి అవమానంగా ఫీల్ అవుతుంది. ప్రభావతిని సత్యం గద్దించడంతో తనకు కూడా తెలుసుని చెబుతుంది. ఇంట్లోంచి రోహిణి వెళ్లిపోతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఇంట్లోకి హడావిడిగా వచ్చి అందరిని పిలుస్తాడు. నాన్నా.. నాన్నా భార్య.. మీనా.. మీనా భార్యా.. లక్షలు మింగినోడా.. వాడి భార్య.. లేచిపోయినోడా.. వాడి భార్యా.. అంటూ గోల చేస్తాడు బాలు. ఇంతలో అందరు వస్తారు.
చీప్ గెస్ట్ నువ్వే
అమ్మా ఏది.. నాకు అమ్మా కావాలి అని చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా చేస్తాడు బాలు. చిన్న మెదడు చిట్లిందా. ఏమైందని ప్రభావతి అంటుంది. నీకు ఏం కాకూడదని దేవుడుని కోరుకుంటున్నాను అని బాలు అంటాడు. అమ్మా మనోజ్ మాతా, పార్లరమ్మా అత్తా ఈ ముఖ్య కార్యక్రమానికి చీప్ గెస్ట్ నువ్వే అని బాలు అంటాడు. చీప్ కాదు చీఫ్ అని రవి అంటాడు. చీపే కరెక్ట్ అని బాలు అంటాడు. అసలు ఏమైందిరా అని సత్యం అంటాడు.
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకోటి దొరికింది అని బాలు అంటాడు. ఏంట్రా బంగారమా అని ప్రభావతి అంటే.. హా.. వడ్డానం చేయించుకో అని బాలు అంటాడు. ఏమైంది బాలు. ఎందుకు పిలిచావ్ అని రోహిణి అంటే.. జాలిగా చూస్తూ.. పార్లరమ్మా ఎందుకైన మంచిది ఏబీసీ జ్యూస్ చేసుకుని తాగిరా అమ్మా అని బాలు అంటాడు. నాకేం అవసరం లేదు కానీ విషయమేంటో చెప్పు. అసలే అలసిపోయి వచ్చాను అని రోహిణి అంటే.. ఆ ఆఫీసర్ ఇంకా రాలేదా అని బాలు అంటాడు.
అంతా ఎవరు అన్నట్లుగా చూస్తారు. అదే కారు షో రూమ్ ఎగ్జిగ్యూటివ్ అని బాలు అంటే.. లేదు. ఇవాళ ఏదో ముఖ్యమైన క్లైంట్ వస్తారని, లేట్ అవుతుందని చెప్పాడు అని రోహిణి అంటుంది. అవునా.. అలా చెప్పాడా. అయ్యయ్యో ఎంత బిజీగా ఉన్నాడో బిడ్డా అని బాలు అంటాడు. నాకు మీ మొహంలో నవరసాలు కనిపిస్తున్నాయి. ఏమైందని అడుగుతుంది మీనా. అసలు ఈ ప్రపంచంలో నాకంటే పసి బిడ్డ లేదు మీనా. ఏ కుట్ర, ఏ కుతంత్రం, ఏ మోసం, ఏ వేషం వేయకుండా నేను నేనులాగే ఉన్నాను బాలు అంటాడు.
పుడింగి స్టోరీ
అది నాకు తెలుసు కానీ, విషయం చెప్పండి అని మీనా అంటుంది. చెప్పను చూపిస్తాను. డబ్బుడమ్మా ల్యాప్‌టాప్ తీసుకురా అని బాలు అంటే.. రవి తీసుకొస్తాడు. దాంతో ఏంటీ పని అని శ్రుతి అడిగితే.. నాకు ఏం పనిలేదు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. వీళ్లంతా చూడాలంటే ఈ డొక్కు టీవీలో కుదరదని నీ ల్యాప్ ట్యాప్ తెమ్మనన్నాను అని బాలు అంటాడు. రవి ల్యాప్ ట్యాప్ తెస్తాడు. టీ పాయ్ మీద పెట్టి దానికి ఫోన్ కనెక్ట్ చేస్తాడు బాలు.
ఏ షార్ట్ ఫిల్మ్ ఇది అని శ్రుతి అంటే.. ఒక పుడింగి స్టోరీ. ఇందులో నటించింది ఎవరనుకున్నావ్. మాములు నటుడు కాదు. నట బీభత్స.. నట భయానక.. నట నక్క అని బాలు అంటాడు. చూడండి. బాగా చూడమ్మా. నీకిష్టమైన నటుడి ఎంట్రీ బాలు అంటాడు. ప్రభావతి వెళ్లిపోతుంటే.. బాలు ఆపి బిగ్ బాస్ లెవెల్‌లో డైలాగ్ చెబుతూ అది ఒక సుందరమైన ఉద్యానవనం అంటే పార్క్ అని వీడియో ప్లే చేస్తాడు బాలు. పార్క్‌లో మనోజ్ చేసిందంతా చూసి షాక్ అవుతారు.
ప్రభావతి అనుమానంగా చూస్తుంది. మనోజ్ ఏంటీ పార్క్‌లో ఉన్నాడేంటీ అని రోహిణి అడుగుతుంది. ప్రభావతి కవర్ చేయడానికి చూస్తే.. బాలు ఆపి మనోజ్ చేసే పనుల గురించి చెబుతాడు. అది చూపిస్తాడు. చూశావా నాన్న నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు అయిపోయాడు. నా బుజ్జి కన్నా అని బాలు అంటాడు. సత్యం తల పట్టుకుంటాడు. తర్వాత మనోజ్ నిద్రపోవడం చూపిస్తాడు బాలు. ఏం చేస్తున్నాడురా వీడు అని సత్యం అంటాడు.
రోహిణికి అవమానం
ఉద్యోగం నాన్నా. పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అని బాలు అంటుంది. ఆపురా.. అని ప్రభావతి అంటే.. బాలు ఆపడు. ఇప్పుడు సమయం నాలుగు గంటలు టీ సమోస సమయం అనగానే మనోజ్ వాళ్లు టీ, సమోస తింటుంటారు. ఇక ఇప్పుడు సమయం ఐదు గంటలు. పాపం ఇప్పటివరకు కష్టపడిన బిడ్డలు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు అని బాలు అంటాడు. అయితే. మీ హస్బండ్ జాబ్ చేయట్లేదా రోహిణి శ్రుతి అంటుంది.
చూస్తుంటూనే అర్థమైపోతుందిలే అని మీనా అంటుంది. ఏంటమ్మా ఇదంతా వాడు ఉద్యోగం చేయకుండా పార్క్‌లో బేవర్స్‌గా తిరుగుతున్నాడా అని సత్యం అంటాడు. ఆయన ఏ క్లైంట్‌ను కలవడానికి వెళ్లారో. బాలు చెప్పేది నిజమని ఎలా నమ్మేది అని రోహిణి అంటుంది. తెలుసు, ఈ క్వశ్చన్ నువ్ వేస్తావని నాకు తెలుసు అని వాచ్‌మెన్ మాట్లాడిన వీడియో చూపిస్తాడు బాలు. అందులో వాళ్లు ఇంట్లో ఆఫీస్ అని చెప్పి ఇక్కడ టైమ్ పాస్ చేస్తారని వాచ్‌మెన్ చెబుతాడు.
ఇంకా డౌట్ ఉంటే కారు షో రూమ్‌కు వెళ్లి కూడా ఎంక్వైరీ చేశాను. ఆ రికార్డ్ కూడా ఉంది అని ఆడియో వినిపిస్తాడు బాలు. ఇంత మోసమా.. ఇంత చీటింగా అని శ్రుతి అంటుంది. మీ ఆయన వెలగబెట్టే ఉద్యోగం చాలా బాగుంది రోహిణి మీనా అంటుంది. వాడు ఒక్కడే స్పెషల్ అన్నట్లుగా మమ్మల్ని ఎంత చీప్‌గా చూసేవాడో గుర్తుందా వదినా. ఇప్పుడు వాడిని మేము ఎలా చూడాలి అని రవి అంటాడు. ఇంతలో పూలకుండీ ఎదురుగా ఉందని మనోజ్ అరుచుకుంటూ వస్తాడు.
అరుచుకుంటూ వచ్చిన మనోజ్
నాలాంటి బిజినెస్ ఎగ్జిగ్యూటివ్స్ వస్తే దారికి అడ్డుగా చీప్‌గా పూలకుండీ పెడతారేంటీ. అది తోపుడు బండే కదా. ఒక్క తన్ను తంతే ఎక్కడికో పోతుంది. అక్కడ అమ్ముకోమ్మను. నా కొలిగ్స్ చూస్తే నా పరువు పోతుంది. నా ప్రతిష్ట ఏమైపోతుంది అని మనోజ్ చిరాకుగా అంటాడు. మీ కారు డ్రైవర్లందరూ పని అయిపోగానే ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏదో ఒక గొడవ తీసుకురావడమేనా పని అని మనోజ్ అంటాడు. అవును అన్నయ్య ఏం చేయాలి. నువ్వంటే కారు షోరూమ్‌లో పెద్ద ఎగ్జిగూట్లేవి అని బాలు అంటాడు.
ఇవాళ ఎందుకు లేట్‌గా వచ్చావ్. ఆ కథ చెప్పవేంటీ అని బాలు అడుగుతాడు. ఇవాళ షో రూమ్‌కి పెద్ద సెలబ్రిటీ కస్టమర్ వచ్చాడు. ఆయనెవరో తెలుసా. మన సెలబ్రిటీ ది గ్రేట్ కింగ్ నాగార్జున గారు. ఆయన కారు కొనడానికి వస్తే మా ఎండీ నన్ను పిలిచారు. నా ఇంగ్లీష్ చూసి ఆయన ఇంప్రెస్ అయిపోయారు అని మనోజ్ అంటాడు. సరిగ్గా ఇదంతా ఎన్నిటికి అని బాలు అంటే.. పన్నెండింటికి అని మనోజ్ అంటే.. ఆ టైమ్‌లో మనోజ్ చేసింది చూపిస్తూ అంతా విన్నారా అని బాలు అంటాడు.
అన్నయ్య నాగార్జున సెల్ఫీ తీసుకుని ఉంటావ్‌గా చూపించు అని బాలు అంటాడు. మర్చిపోయారా. కారు తీసుకునేటప్పుడు వస్తారుగా అప్పుడు తీసుకుంటా. ఇంకో గుడ్ న్యూస్. వచ్చే నెల నా జీతం డబుల్ చేస్తాడన్నాడు తెలుసా అని మనోజ్ అంటాడు. అసలు ఈ నెల జీతం ఏదిరా అని బాలు అంటాడు. ఈ నెల షేర్ అమ్మకిచ్చాను అని మనోజ్ ప్రభావతిని ఇరికిస్తాడు. కానీ, ప్రభావతి మాత్రం ఎప్పుడు ఇచ్చావ్ అని అంటుంది.
ఆహా నట నక్క
అన్నయ్య చెబితే ఇంకా వినాలని ఉందని రవి అంటాడు. మీరు వినడం తప్పా ఏం చేయరు. మీ లైఫ్‌లో ఇలాంటి అద్భుతాలు జరగవు అని గొప్పలు పోతాడు మనోజ్. కరెక్ట్‌రా ఇప్పుడు నీకు కూడా నేను కొన్ని అద్భుతాలు చూపిస్తానని బాలు అంటాడు. మనోజ్ వెళ్లిపోతుంటే.. ఆపి మరి కుర్చీలో కూర్చుండబెట్టి మరి చూపిస్తాడు బాలు. అరేయ్ ఇది మన పార్క్‌లా ఉందని మనోజ్ అంటే.. అవును, నీ ఆఫీస్ ఇందులోనే ఉంది. నాగార్జున గారు వచ్చింది ఇక్కడికే అని బాలు అంటాడు.
దాంతో మనోజ్ అనుమానంగా చూస్తాడు. అంతా మనోజ్‌ను కోపంగా చూస్తారు. అది చూసి ఏంటీ అంతా నన్ను చూస్తున్నారు. అక్కడ చూడండి అని మనోజ్ అంటాడు. నీ మొహంలో మారే రంగులు చూద్దామని బాలు అంటాడు. వీడియోలో తనను చూసి అవాక్కవుతాడు మనోజ్. హమ్మా బాబోయ్ ఈరోజు నా పని అయిపోయింది అని మనోజ్ అనుకుంటాడు. ఆహా నట నక్క ఎంత బాగా నటించావురా అని బాలు అంటాడు. ఇన్నిరోజులు అందరిని మోసం చేస్తున్నావు అని సత్యం అరుస్తాడు.
నాన్నా వీడు అమ్మ వైపు చూస్తున్నాడు. అంటే ఇదంతా అమ్మకు ఎప్పటి నుంచో తెలుసు అని బాలు అంటాడు. నన్ను ఇరికిస్తే బాగుండదు. నాకు తెలుసని నీకెలా తెలుసు అని ప్రభావతి అంటుంది. నిజం చెప్పు. లేకుంటే తల్లీకొడుకులను ఇద్దరిని బయటకు గెంటేస్తాను. ఆ పార్క్‌లోనే బతకాలి అని సత్యం గద్దిస్తాడు. దాంతో తెలుసు అని ప్రభావతి అంటుంది. రోహిణి, మీనా, అంతా షాక్ అవుతారు. వాడి ఉద్యోగం పోయిందని తెలుసు. ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడని అనుకున్నాను. కానీ, ఇలా దొరికిపోతాడని తెలియదు అని ప్రభావతి అంటుంది.
ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి
ఇలా ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావ్. ఎన్ని రహాస్యాలు దాస్తావ్. ఇంత పెద్ద విషయం దాచి వాడు నువ్ నన్ను వెర్రివాన్ని చేయాలని చూస్తారా. ఇంకా ఏమేం చేశారు. ఎంతగా ఈ కుటుంబాన్ని దిగజారుస్తారు అని సత్యం ఫైర్ అవుతాడు. సిగ్గులేదా మీకు అంటాడు. ఎప్పటిలా మాట్లాడట్లేదే అని ప్రభావతిని అంటాడు బాలు. తను నన్ను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదే అని తన ఫ్రెండ్‌తో చెబుతుంది రోహిణి.
అందరికంటే ఎక్కువ మోసం చేసింది నువ్వు, పెద్ద అబద్ధం ఆడింది నువ్వు అని రోహిణి ఫ్రెండ్ అంటుంది. అనంతరం రోహిణి కోసం తన ఫ్రెండ్‌కు మనోజ్ కాల్ చేస్తాడు. తను ఎక్కడికో వెళ్లిపోయిందని రోహిణి ఫ్రెండ్ చెబుతుంది. ఆ విషయం మనోజ్ ఇంట్లో చెబుతాడు. దాంతో బాలుపై అంతా నువ్వే చేశావ్ అని ప్రభావతి అంటుంది. అరేయ్ నా భార్యను అనడానికి నువ్వెవడురా అని బాలు కాలర్ పట్టుకుంటాడు మనోజ్.
దాంతో మనోజ్ చెంప చెల్లుమనిపిస్తాడు బాలు. మనోజ్, బాలు ఇద్దరు కొట్టుకుంటారు. అది చూసిన సత్యం అరుస్తాడు. కొట్టుకోండి. ఇద్దరు కొట్టుకుని చావండి అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్