Rajamouli: రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన బెస్ట్ ఫ్రెండ్.. టార్చర్ చేస్తున్నాడు.. చనిపోతా అంటూ వీడియో

Best Web Hosting Provider In India 2024

Rajamouli: రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన బెస్ట్ ఫ్రెండ్.. టార్చర్ చేస్తున్నాడు.. చనిపోతా అంటూ వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2025 02:56 PM IST

SS Rajamouli: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు శ్రీనివాస రావు. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తన చావుకు రాజమౌళినే కారణం అంటూ మాట్లాడారు. వివరాలివే..

Rajamouli: రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన బెస్ట్ ఫ్రెండ్
Rajamouli: రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన బెస్ట్ ఫ్రెండ్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ యు.శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాజమౌళినే అందుకు కారణంగా అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. గతంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని, ఇప్పుడు రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అమ్మాయిని త్యాగం చేశా..

తనది, రాజమౌళిది 34 ఏళ్ల స్నేహం అని ఆ వీడియోలో శ్రీనివాసరావు తెలిపారు. ఓ అమ్మాయిని రాజమౌళి, తాను ప్రేమించామని, తమది ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అన్నారు. అప్పట్లో అమ్మాయిని త్యాగం చేయాలని రాజమౌళి అడిగితే.. తాను ముందు అంగీకరించలేదని తెలిపారు. అయితే, ఆ తర్వాత తానే త్యాగం చేశానని అన్నారు. ఇది శాంతినివాసం సీరియల్ కంటే ఇది ముందు జరిగిన విషయమని తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో కాబట్టి ఇబ్బంది ఉండకూడదని తాను అలా చేశానని అన్నారు. తన జీవితాన్ని రాజమౌళి నాశనం చేశారంటూ చెప్పుకొచ్చారు.

టార్చర్ చేస్తున్నాడు.. నా చావుకు రాజమౌళినే కారణం

రాజమౌళి ప్రస్తుతం టాప్ డైరెక్టర్ అని, తాను ఆ విషయాలు అందరికీ చెప్పానని ఇప్పుడు టార్చర్ చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. తనకు, రాజమౌళికి ఓసారి గొడవ జరిగిందని, తమ స్టోరీనే సినిమా తీస్తా అన్నందుకు ఆయన నరకం చూపించారని పేర్కొన్నారు. తనకు 55 ఏళ్ల నిండాయని, ఒంటరిగానే ఉంటున్నానని తెలిపారు. తాను చనిపోయేందుకు నిర్ణయించుకునేందుకు రాజమౌళినే కారణం అనేలా మాట్లాడారు. అమ్మాయిల జోలికి వెళ్లవద్దని, కెరీర్లో ఎదగాలని యువతకు సందేశం కూడా ఇచ్చారు శ్రీనివాసరావు.

లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి

ఫ్రెండ్ వల్ల తన జీవితం ఇలా అయిందని తనకు బాధగా ఉందని శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయాలపై తన వద్ద ఆధారాలు లేవని తెలిపారు. తాను చనిపోయిన తర్వాత కేసును సుమోటోగా తీసుకొని, రాజమౌళికి లైడిటెక్టర్ టెస్ట్ చేయాలని ఆయన మాట్లాడారు. అప్పుడే నిజాలు బయటపడతాయని చెప్పారు. రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్‌గా తాను పని చేశానని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదే తన మరణ వాగ్మూలం అంటూ వీడియోను ముగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం శ్రీనివాసరావు ఎక్కడున్నారనేది తెలియాల్సి ఉంది.

దేశంలోనే టాప్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న రాజమౌళిపై తన క్లోజ్ ఫ్రెండే ఇలాంటి తీవ్రమైన విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఈ వివాదం దేనికి దారితీస్తుందో, రాజమౌళి స్పందిస్తారేమో చూడాలి.

బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ వచ్చేసింది. గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ భారీ బడ్జెట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్లోబల్ రేంజ్ మూవీగా భారీ స్కేల్‍లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంపై ఇంటర్నేషనల్ వైడ్‍గా క్రేజ్ ఉండనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024