Sikandar Teaser: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా క్రేజీ మూవీ టీజర్ రిలీజ్.. స్టంట్స్, వయలెన్స్ నెక్ట్స్ లెవెల్

Best Web Hosting Provider In India 2024

Sikandar Teaser: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా క్రేజీ మూవీ టీజర్ రిలీజ్.. స్టంట్స్, వయలెన్స్ నెక్ట్స్ లెవెల్

Hari Prasad S HT Telugu
Feb 27, 2025 04:28 PM IST

Sikandar Teaser: సికందర్ టీజర్ వచ్చేసింది. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా క్రేజీ మూవీ టీజర్ రిలీజ్.. స్టంట్స్, వయలెన్స్ నెక్ట్స్ లెవెల్
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా క్రేజీ మూవీ టీజర్ రిలీజ్.. స్టంట్స్, వయలెన్స్ నెక్ట్స్ లెవెల్

Sikandar Teaser: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సికందర్ (Sikandar). రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ గురువారం (ఫిబ్రవరి 27) రిలీజైంది. ఈ సినిమా నుంచి వచ్చిన రెండో టీజర్ ఇది.

సికందర్ టీజర్ ఎలా ఉందంటే?

సల్మాన్ ఖాన్ గురువారం తన మూవీ టీజర్ ను రిలీజ్ చేశాడు. ఒక నిమిషం 21 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ మొత్తం స్టంట్స్, వయలెన్స్ తో నిండిపోయింది. మా నానమ్మ నాకు సికందర్ అనే పేరు పెట్టింది.. తాతేమో సంజయ్ అని అన్నాడు. ఇక ప్రజలు మాత్రం రాజా సాబ్ అన్నారు అంటూ సల్మాన్ ఖాన్ ఇంట్రడక్షన్ మరో లెవెల్లో ఉంది.

ఇన్సాఫ్ (న్యాయం) కోసం కాదు సాఫ్ చేయడానికి వచ్చాను అనే సల్మాన్ డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత టీజర్ మొత్తం ఇక ఫైట్లు, స్టంట్స్ ఇలా ఫుల్ యాక్షన్ తో నింపేశారు. మూవీలో ఫిమేల్ లీడ్ గా కనిపిస్తున్న రష్మిక మందన్నా కూడా ఈ టీజర్ లో ఉంది. నీ శత్రువుల్లో నువ్వు ఎంత పాపులరో తెలుసా అనే డైలాగ్ రష్మిక నోటి నుంచి వినిపిస్తుంది. అయితే టీజర్లో సల్మాన్ డైలాగులే అంత సులువుగా అర్థం కావడం లేదు. డైలాగులను యాక్షన్, మ్యూజిక్ డామినేట్ చేస్తున్నాయి.

సికందర్ మూవీ గురించి..

2023లో వచ్చిన టైగర్ 3 మూవీ తర్వాత సల్మాన్ ఖాన్ సోలో హీరోగా నటిస్తున్న మూవీ ఇదే. భారీ అంచనాల మధ్య ఈ మూవీ వస్తోంది. ఏఆర్ మురగదాస్ డైరెక్టర్ కావడం, ఏకంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తుండటంతో ఈ సికందర్ మూవీపై సల్మాన్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఈ సినిమా నుంచి గతేడాది చివర్లో ఓ టీజర్ వచ్చింది. ఈ నెల మొదట్లో సికందర్ కొత్త పోస్టర్ ను కూడా సల్మాన్ లాంచ్ చేశాడు. రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రంజాన్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024