




Best Web Hosting Provider In India 2024

ఆ సినిమాలు, వెబ్ సిరీస్ తొలగించండి.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు భారత ప్రభుత్వం ఆదేశాలు
పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు భారత ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ నుంచి వచ్చే కంటెంట్ విషయానికి సంబంధించి ఈ ఆదేశాలు రావడం గమనార్హం.
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాదుల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సర్వీసులకు ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
అలాంటి కంటెంట్ ఉండకూడదు
ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు జారీ చేసిన ఆదేశాల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ఈ అడ్వైజరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు 2021 ప్రకారం జారీ చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్ నుంచి వచ్చే కంటెంట్ కు ఇవి వర్తిస్తాయి. దీని ప్రకారం కొన్ని రకాల కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రీమింగ్ చేయకూడదు. అవేంటంటే..
- భారత ప్రభుత్వ సమగ్రత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేవి
- దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసేవి
- విదేశాలతో సంబంధాలను దెబ్బ తీసేలా ఉన్నవి
- హింసను ప్రేరేపించేవి
పాకిస్థాన్ కంటెంట్‌కు చెక్
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్, ఉద్రిక్తతల నేపథ్యంలో జాతి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాకిస్థాన్ నుంచి వచ్చిన కంటెంట్ అంటే సినిమాలు, వెబ్ సిరీస్, పాటలు, పాడ్‌కాస్ట్స్.. ఇలా అన్నింటినీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ తొలగించాలని ఆదేశించింది. అవి పెయిడ్ లేదా ఫ్రీ అయినా ఈ ఆదేశాలను పాటించాల్సిందే అని స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరకంగా యుద్ధ వాతావరణం ఉంది. సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం, సైన్యం కూడా అప్రమత్తంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి పాకిస్థాన్ నుంచి వచ్చే కంటెంట్ ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత కథనం