హైబీపీ మాత్రమే కాదు లోబీపీ కూడా చాలా ప్రమాదం, లోబీపీ లక్షణాలు ఇలా ఉంటాయి

Best Web Hosting Provider In India 2024

హైబీపీ మాత్రమే కాదు లోబీపీ కూడా చాలా ప్రమాదం, లోబీపీ లక్షణాలు ఇలా ఉంటాయి

Haritha Chappa HT Telugu

మీ రక్తపోటు తక్కువగా ఉంటే, మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టవచ్చా? కామెడీ ఖిలాడి రాకేష్ పూజారి మరణం తర్వాత ఇలాంటి ప్రశ్న చాలా మందిని వెంటాడి ఉండవచ్చు. లో బీపీ నిజంగా అంత ప్రమాదకరమా, దాని లక్షణాలు, జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

లోబీపీ లక్షణాలు (Pexels)

హైబీపీ చాలా డేంజర్ అని చాలా మంది అనుకుంటారు. నిజానికి లోబీపీ కూడా ప్రమాదకరమైనదే. మీ రక్తపోటు తక్కువగా ఉంటే అది మరణానికి దారితీస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. తక్కువ రక్తపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా నివారించాలి? అనే విషయాలు తెలుసుకోండి.

తక్కువ రక్తపోటు అంటే ఏమిటి?

తక్కువ రక్తపోటు లేదా లోబీపీ అనేది ధమనుల గోడలకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తక్కువగా ఉందని అర్థం. దీనిని హైపోటెన్షన్ అని కూడా అంటారు. రక్తపోటును మిల్లీమీటర్ పాదరసం (మిమీ Hg) లో కొలుస్తారు. 90/60 mm Hg కంటే తక్కువ ఉన్న పరిస్థితిని తక్కువ రక్తపోటుగా పరిగణిస్తారు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పటికీ నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితి ఉన్నవారిలో మైకము, మూర్ఛకు దారితీస్తుంది. కొన్నిసార్లు తక్కువ రక్తపోటు కారణంగా మరణం సంభవించవచ్చు.

డీహైడ్రేషన్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తక్కువ రక్తపోటుకు దారితీస్తాయి. తక్కువ రక్తపోటుకు కారణమేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లో బిపి లక్షణాలు

తక్కువ రక్తపోలు ఉన్నవారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు తగ్గినప్పుడు మీలో ఈ మార్పులు కనిపిస్తాయి.

* దృష్టి మసకబారడం

* మైకము

* మూర్ఛ

* అలసట

* పనులపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది

* పొత్తికడుపు నొప్పి

రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం ప్రమాదకరం. సిస్టోలిక్ పీడనం 110 mm Hg నుండి 90 mm Hgకు పడిపోయిన తర్వాత పైన చెప్పిన లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన రక్తస్రావం, అంటువ్యాధులు, అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు.

తక్కువ రక్తపోటుకు కారణాలు ఏమిటి?

* ఎక్కువ సేపు పడుకోవడం

* ఎక్కువ సేపు నిలబడటం

* డిప్రెషన్

* పార్కిన్సన్స్ వ్యాధి

* గర్భం ధరించడం

* డీహైడ్రేషన్

* మూత్రవిసర్జన,

అధిక రక్తపోటుకు ఇచ్చే కొన్ని మందులు, బీటా బ్లాకర్స్ వంటి కార్డియోవాస్క్యులర్ మందులు, పార్కిన్సన్ వ్యాధికి వాడే మందులు, ట్రైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్స్, అంగస్తంభన మందులు, మాదకద్రవ్యాల దుర్వినియోగం మొదలైనవి కూడా తక్కువ రక్తపోటుకు కారణం కావచ్చు.

తక్కువ రక్తపోటు వల్ల గుండె సమస్యలు వస్తాయి. హృదయ స్పందన రేటు తగ్గిపోతుంది. గుండె కవాట సమస్యలు, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు.

అలాగే క్రియారహిత థైరాయిడ్, అడిసన్ వ్యాధి, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు, డయాబెటిస్ కూడా తక్కువ రక్తపోటుకు కారణమవుతాయి.

ఈ సమస్యలు రావచ్చు

సెప్టిక్ షాక్: ఇన్ఫెక్షన్ నుండి బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించినప్పుడు ఇది సంభవిస్తుంది. బ్యాక్టీరియా అప్పుడు రక్త నాళాలను ప్రభావితం చేసే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రమాదకరంగా తక్కువ రక్తపోటుకు దారితీస్తుంది.

అలెర్జీ ప్రతిచర్య: అనాఫిలాక్టిక్ షాక్ అనేది మరణానికి దారితీసే ఒక అలెర్జీ ప్రతిచర్య. పెన్సిలిన్ వంటి మందులకు ఎక్కువ సున్నితంగా ఉన్నవారిలో ఇది సంభవిస్తుంది. ఇది కొన్ని ఆహారాలు తిన్న తర్వాత లేదా తేనెటీగ లేదా కందిరీగ ద్వారా ఇంజెక్ట్ చేసిన తర్వాత కూడా సంభవిస్తుంది.

రక్త పరిమాణం తగ్గడం: పెద్ద షాక్ లేదా తీవ్రమైన అంతర్గత రక్తస్రావం కారణంగా గణనీయమైన రక్త నష్టం రక్తం పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తపోటులో తగ్గుదలకు దారితీస్తుంది.

రక్తపోటు తక్కువగా ఈ లక్షణాలు వెంటనే కనిపించవు. కాబట్టి గుర్తించడం కష్టమవుతుంది. కానీ ఏమాత్రం పైన పేర్కొన్న లక్షణాలను మీరు గుర్తించినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది. తరచూ బీపీ పరీక్షలు చేయించుకోవడం వల్ల రక్తపోటు స్థాయిని తెలుసుకోవచ్చు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024