



Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తల్లి చనిపోయిందంటూ రోహిణి అబద్దం -ప్రభావతి గొప్పలు – బాలు టార్గెట్
గుండె నిండా గుడి గంటలు జూన్ 25 ఎపిసోడ్లో రోహిణికి డబ్బు ఇవ్వడానికి పార్లర్‌కు వస్తుంది ఆమె తల్లి సుగుణ. అదే టైమ్‌లో రోహిణిని వెతుక్కుంటూ ప్రభావతి కూడా పార్లర్‌కు వస్తుంది. తన తల్లిని ప్రభావతి గుర్తు పట్టకుండా ఆమెకు ఫేస్ ప్యాక్ చేస్తుంది రోహిణి.
నల్లపూసల ఫంక్షన్ సమస్య నుంచి గటెక్కడానికి బాలును పావుగా వాడుకోవాలని ఫిక్సవుతుంది రోహిణి. బాలును అడ్డుపెట్టుకొని తన తండ్రి టాపిక్‌ను ప్రభావతి ఎత్తకుండా చేయాలని అనుకుంటుంది. అందుకోసం విద్యతో కలిసి కొత్త ప్లాన్ వేస్తుంది.
శివకు వార్నింగ్…
గుణ దగ్గర పనిమానేయమని శివతో అంటుంది పార్వతి. తాను న్యాయంగానే సంపాదిస్తున్నానని తల్లితో వాదిస్తాడు శివ. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. అల్లుడుగారు రాలేదా అని మీనాను పార్వతి అడుగుతుంది.
ఆ గారు వల్లే తన చేయి విరిగింది అంటూ బాలును తక్కువ చేసి మాట్లాడుతాడు శివ. మా ఆయన విషయంలో మరోసారి నోరుజారితే ఊరుకునేది లేదని శివకు వార్నింగ్ ఇస్తుంది మీనా.
రోహిణి, శృతి నల్లపూసల ఫంక్షన్‌కు బాలును రావొద్దని ప్రభావతి అంటున్నాదని, బాలు వెళ్లకపోతే ఆ వేడుకకు తాను వెళ్లేది లేదని తల్లితో మీనా అంటుంది.
రోహిణి టెన్షన్…
రోహిణికి డబ్బు ఇవ్వడానికి ఆమె తల్లి సుగుణ పార్లర్‌కు వస్తుంది. తల్లిని చూడగానే రోహిణి కంగారు పడుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. పార్లర్లో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదని తల్లితో అంటుంది.రోహిణి మొదటి పెళ్లి తాళిని తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి రోహిణికి ఇస్తుంది సుగుణ.
అప్పుడే పార్లర్ రోహిణిని వెతుక్కుంటూ ప్రభావతి వస్తుంది. పార్లర్ లోపలికి వెళ్లబోతుంది. రిసెప్షనిస్ట్ ఆమెను లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. బోర్డ్‌పై తన పేరు లేదు, పార్లర్లో గౌరవం లేకుండాపోయిందని ప్రభావతి చిందులు తొక్కుతుంది.
ఫేస్‌ప్యాక్‌తో కవర్…
రిసెప్షనిస్ట్ వచ్చి ప్రభావతి వచ్చిన సంగతి రోహిణికి చెబుతుంది. ఆ మాట వినగానే రోహిణి కంగారు పడుతుంది. తల్లిని ప్రభావతి చూడకుండా ఏం చేయాలో తెలియక వణికిపోతుంది. తల్లిని ప్రభావతి గుర్తుపట్టకుండా ఫేస్ ప్యాక్ చేస్తుంది. రోహిణి కోసం రిసెప్షన్లో వెయిట్ చేయలేక పార్లర్ లోపలికి వస్తుంది ప్రభావతి. తల్లి తీసుకొచ్చిన డబ్బులను ప్రభావతికి ఇస్తుంది రోహిణి.
మీ అమ్మ బతికి ఉంటే నీ ఫంక్షన్ గ్రాండ్ జరిగిఉండేది రోహిణితో అంటుంది ప్రభావతి. తన తల్లి చనిపోయిందని రోహిణి ఆడిన అబద్ధాన్ని గుర్తు చేస్తుంది ప్రభావతి. ఆ మాటలు విని సుగుణ బాధపడుతుంది. తల్లిని కస్టమర్‌గా ప్రభావతికి పరిచయం చేస్తుంది రోహిణి.
రోహిణి అదృష్టం…
రోహిణి తల్లి ఏదో మాయదారి రోగంతో చనిపోయిందని, అమ్మను తల్చుకొని రోహిణి ఏడుస్తుంటుందని సుగుణతో అంటుంది ప్రభావతి. మీ లాంటి మంచి అత్త దొరకడం రోహిణి అదృష్టమని సుగుణ అంటుంది. రోహిణి అబద్దాలు విని సుగుణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రభావతి వెళ్లిపోగానే మా అత్తయ్య మాటలు ఏం పట్టించుకోవద్దని తల్లితో అంటుంది రోహిణి. నువ్వు బాగుంటే చాలాని బాధతో సుగుణ వెళ్లిపోతుంది.
బాలును డబ్బులు అడగొద్దు…
శృతి, రోహిణి ఫంక్షన్‌కు అవసరమయ్యే సరుకులను తీసుకురమ్మని భర్తతో అంటుంది ప్రభావతి. డబ్బులు లేవని సత్యం అంటాడు. మీ ముద్దుల కొడుకు దగ్గర తీసుకొండి అని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. ఫంక్షన్ శృతి, రోహిణిలదైతే బాలును డబ్బులు అడగటం ఏంటి అని సత్యం అంటాడు.
బాలుకు ఈ ఫంక్షన్‌తో సంబంధం లేదని, వాడిని డబ్బులు అడగొద్దని ప్రభావతికి చెబుతాడు సత్యం. మీనాకు పదహారు రోజుల ఫంక్షన్ చేశాం…నల్లపూసలు వేశం…ఆ పూల వాళ్లు ఏమైనా పెట్టారా అంటూ ప్రభావతి చిందులు తొక్కుతుంది. బాలు లేడని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ప్రభావతి మాటలు సహించలేక ఆమెను కొట్టబోతాడు సత్యం. నాన్న అంటూ తండ్రిని ఆపేస్తాడు బాలు.
ప్రభావతికి క్లాస్…
బాలు తన మాటలు విన్నాడని తెలిసి ప్రభావతి కంగారు పడుతుంది. నేను లేనప్పుడు నా భార్యను ఎన్ని మాటలు అంటున్నావో ఇప్పుడు అర్థమవుతుందని బాలు అంటాడు. మీనాకు పుస్తెలు తెచ్చింది నానమ్మ అయితే నీ ఆకౌంట్ లో వేసుకుంటున్నావేంటి అని ప్రభావతి అబద్దాలను బయటపెడతాడు బాలు. మా అత్తగారు నాకు బట్టలు పెట్టారు, పండుగకు వెళితే ఉంగరం పెట్టారని బాలు అంటాడు. వాళ్లను తక్కువ చేస్తే మాట్లాడితే బాగోదని అంటాడు.
బురదలో రాయి వేస్తే..
నీ గొప్పల కోసం శృతి ఫంక్షన్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని ఖరాఖండిగా చెప్పేస్తాడు. మీ అమ్మ గురించి తెలిసిందే కదా…బురదలో రాయేసి కడుక్కొనే లోపు మీ పనులన్నీ ఆగిపోతాయి, మీ పనులు మీరు చూసుకొండి అని బాలు, మీనాతో అంటాడు సత్యం.
నీకు ఓ కూతురు ఉంది…ఉన్నవాళ్ల ఇంట్లో ఉంది. వాళ్లు నిన్ను తక్కువ చేస్తే నీకు ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోమని చెప్పి బాలు వెళ్లిపోతాడు.
నీలకంఠం, సంజు పంచ్‌లు…
శృతి ఫంక్షన్‌కు మౌనికను పిలవడానికి ప్రభావతి, సత్యం వెళతారు. వారి ముందు తమ అసలు రంగు బయటపెడతారు నీలకంఠం, సంజు. మీరు ఉంటారో ఉండరో అని అనుకుంటూ వచ్చామని నీలకంఠంతో అంటుంది ప్రభావతి. అలా అనుకుంటూ రావడం ఎందుకు, ఫోన్ చేసి అడిగి రావచ్చుగా అని నీలకంఠం ఫైర్ అవుతాడు. సంజు కనిపించగానే బాగున్నారా బాబు అని సంజును పలకరిస్తాడు సత్యం. బాగాలేకపోతే ట్రీట్మెంట్ ఇస్తారా సంజు సెటైర్ వేస్తాడు.
వదినగారు లేరా అని నీలకంఠాన్ని అడుగుతుంది ప్రభావతి. మీరు వచ్చింది మా అమ్మ కోసమా, మీ కూతురు కోసమా అని సంజు ఫైర్ అవుతాడు. ఆ వెర్రిమాలోకంతో వీళ్లకు పనేంటి అని నీలకంఠం అంటాడు.
శృతి ఫంక్షన్‌కు బాలు, మీనా వస్తారు. బాలును అడ్డుపెట్టుకొని ఈ ఫంక్షన్లో గొడవలు చేయాలని ఓ వైపు రోహిణి, మరోవైపు శోభన ప్లాన్ చేస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.