





Best Web Hosting Provider In India 2024

ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చిన రూ.2400 కోట్ల హాలీవుడ్ హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ ఓ ట్విస్ట్
ఓ హాలీవుడ్ హారర్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ.2400 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. థియేటర్లలో రిలీజైన 40 రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ ఫ్రాంఛైజీ ఫైనల్ డెస్టినేషన్ నుంచి వచ్చిన ఆరో మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్. ఈ సినిమా గత నెల 16న థియేటర్లలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడు ఒకేరోజు రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీ స్ట్రీమింగ్
ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా బ్లడ్‌లైన్స్. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, పలు ఇతర భాషల్లో చూడొచ్చు. అయితే ఈ సినిమాను చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతానికి ఫ్రీగా అందుబాటులోకి రాలేదు.
ఈ ఎ రేటెడ్ హారర్ మూవీ చూడాలంటే మాత్రం ఏకంగా రూ.499 చెల్లించాల్సిందే. ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి. నిజానికి ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతూనే ఉంది. అప్పుడే ఓటీటీలోకి తీసుకొచ్చారు. కానీ ఫ్రీగా అందుబాటులో లేకపోవడంతో చాలా మంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ గురించి..
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఈ ఫ్రాంఛైజీ నుంచి ఆరో సినిమా. 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత వచ్చిన మూవీ ఇదే. సుమారు రూ.430 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను జాక్ లిపోవ్‌స్కీ, ఆడమ్ స్టీన్ డైరెక్ట్ చేశారు.
కైట్లిన్ శాంటా జువానా, టియో బ్రయోన్స్, రిచర్డ్ హార్మన్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. మే 16న థియేటర్లలో రిలీజైంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి తొలి ఐదు సినిమాల్లాగే ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐఎండీబీలో ఈ మూవీకి 6.9 రేటింగ్ నమోదైంది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో స్ట్రీమ్స్ లో రూ.499 చెల్లించి చూడొచ్చు.
సంబంధిత కథనం