



Best Web Hosting Provider In India 2024

పదిహేనేళ్ల పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్.. ఈ పోరాటంలో మీ సాయం కోరుతోంది ఆ కుటుంబం
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ పదో తరగతి పిల్లవాడికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఓ కుటుంబం సాయం అర్థిస్తోంది.
పదో తరగతి చదువుతున్న ఆ చిన్న ప్రాణం.. ఎన్నో కలలు, ఆశలు, బతకాలనే తపనతో నిండి ఉంది. కానీ విధి అతడిపై ఓ క్రూరమైన పరీక్షను విసిరింది. ఆ చిన్నారి తేపల్లి నాగ చైతన్య (వయసు 15 సంవత్సరాలు) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడాలంటే వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దానికి ₹50 లక్షలకు పైగా ఖర్చవుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంది.
చికిత్స జరుగుతున్న ఆసుపత్రి: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్.
చికిత్స చేస్తున్న డాక్టర్: డా. పవన్ కుమార్
కానీ ఇక్కడే అసలైన గుండె కోత మొదలైంది. ఈ ధైర్యవంతుడైన పిల్లాడికి తండ్రి లేడు. నాలుగేళ్ల క్రితం ఆర్థిక సమస్యల వల్ల తండ్రి తేపల్లి రత్నాకర్ చనిపోయారు. అతని తల్లి, ఓ నిరుపేద మహిళ. ఆమెకు సరైన ఆదాయం లేదు. ప్రస్తుతం ఈ పిల్లాడిని బాబాయి తేపల్లి విజయ్ (ఫోన్ నెం: 9912784850) చూసుకుంటున్నారు. తన కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఉన్న కాస్త ఆస్తిపాస్తులు అమ్ముకుంటూ, ఎవరి కాళ్ళకు మొక్కాలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. మాకు సౌకర్యాలు వద్దు, మా బిడ్డ ప్రాణం బతికితే చాలు అంటోంది ఆ కుటుంబం.
మీకు తోచిన సహాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ముందుకు రావాలని వేడుకుంటోంది. ఈ చిన్నారికి బతికే అవకాశం కల్పించడానికి చేయి చేయి కలుపుతారని ఆశిస్తోంది. మళ్ళీ ఆ చిరునవ్వును చూడటానికి కారణమవ్వాలని ప్రార్థిస్తోంది.
ఆర్థిక సహాయం చేయదలిచిన వారు ఈ వివరాలను ఉపయోగించగలరు.
ఖాతా వివరాలు:
అకౌంట్ నెం: 62395457851
IFSC: SBIN0021183
బ్యాంక్ పేరు: SBI
లేదా
G-Pay / PhonePe నెంబర్: 9912784850 (తేపల్లి నాగ చైతన్య)
టాపిక్