బరి తెగించిన దంపతులు – ‘న్యూడ్ వీడియో’లతో సరికొత్త దందా..! వెలుగులోకి సంచలన విషయాలు

Best Web Hosting Provider In India 2024

బరి తెగించిన దంపతులు – ‘న్యూడ్ వీడియో’లతో సరికొత్త దందా..! వెలుగులోకి సంచలన విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

న్యూడ్ వీడియోలతో వ్యాపారం చేస్తున్న దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా వారి న్యూడ్‌ వీడియోలను పంపటం లేదా స్ట్రీమింగ్‌ లింక్ షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. విషయం టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరటంతో… వీరి వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది.

న్యూడ్ వీడియోలు విక్రయిస్తున్న దంపతుల అరెస్ట్‌ (representative image) (image source unsplash.com)

వారిద్దరూ దంపతులు..! ఈజీ మనీ దిశగా ఆలోచించారు. ఇందుకోసం ఏకంగా వారు ఎంచుకున్న ఆప్షన్… న్యూడ్ వీడియోల వ్యాపారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరించారు. కానీ వారి న్యూడ్ వీడియోలనే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ ఇవ్వటం వంటివి చేస్తున్నారు. ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి… ఈ సరికొత్త దందాను సాగిస్తున్నారు. విషయం పోలీసులు దృష్టికి రావటంతో…. వీరి వ్యవహారమంతా బయటికి వచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఓపెన్….

నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో నివసముంటున్న దంపతులు ఇదంతా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పులు ఎక్కువ అవ్వటంతో… సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ‘స్వీటీ తెలుగు కపుల్ 2027’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఖాతాను క్రియేట్ చేశారు. ఈ పేరు మీదనే వారి దందాను సాగించటం మొదలుపెట్టారు.

క్లిప్పింగులతో ఆకర్షించి….

వారి న్యూడ్ వీడియోలను క్లిప్పింగులుగా కట్ చేసి పోస్ట్ చేసేవారు. వీటి ద్వారా జనాలను ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేశారు. పూర్తి వీడియో కావాలంటే నేరుగా మెసేజ్ చేయాలంటూ సూచనలు ఇచ్చేవారు. వీరిని అనుసరించి… సదరు నెంబర్లను ఆశ్రయించే వారికి రేట్లు చెప్పేవారు.

రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ కావాలంటే రూ.500గా నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాకుండా… లైవ్ స్ట్రీమింగ్ వీక్షించేందుకు రూ.2000 చెల్లించాలని బేరం పెట్టేవారు. ఇలా వీడియోలు, లింక్ లు పంపుతూ డబ్బులను అర్జిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త…టాస్ఖ్ ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరటంతో… రంగంలోకి దిగారు. పక్కా ఆపరేషన్ నిర్వహించి… దంపతుల జాడను కనిపెట్టారు.

నేరుగా అక్కడికి చేరుకుని వీరి దందా వ్యవహారం గురించి పూర్తి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న కొన్ని కెమెరాలు, లైటింగ్ పరికరాలు, కంప్యూటర్ తో పాటు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Crime NewsHyderabadTelangana NewsTs Police
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024