ఫ్యాటీ లివర్‌కు ఏది మంచిదో, ఏది కాదో తేల్చి చెప్పిన కాలేయ వైద్య నిపుణుడు

Best Web Hosting Provider In India 2024

ఫ్యాటీ లివర్‌కు ఏది మంచిదో, ఏది కాదో తేల్చి చెప్పిన కాలేయ వైద్య నిపుణుడు

HT Telugu Desk HT Telugu

హార్వర్డ్ మరియు స్టాన్ఫోర్డ్-శిక్షణ పొందిన కాలేయ నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథీ కొవ్వు కాలేయానికి ఎంత మంచివి అనే దాని ఆధారంగా 10 సాధారణ ఆహారాలను 1 నుండి 10 స్కేల్లో ర్యాంక్ చేస్తారు.

గ్రీన్ టీ (Adobe Stock)

మన శరీరంలోనే అతి పెద్ద అవయవం కాలేయం (లివర్). ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శక్తిని నిల్వ చేయడానికి, అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మందికి ‘ఫ్యాటీ లివర్’ సమస్య వస్తోంది.

జాతీయ ఆరోగ్య సంస్థ (NIH) ప్రకారం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మందిలో కనిపిస్తోంది. ఈ సంఖ్య పెరుగుతోందని కూడా వారు చెబుతున్నారు. అంటే, ఈ సమస్యపై అవగాహన పెంచడం, ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మెరుగుపరుచుకోవడం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి జూన్ 26న పోస్ట్ చేసిన ఒక వీడియోలో 10 సాధారణ ఆహార పదార్థాలను వాటి ‘ఫ్యాటీ లివర్ స్నేహపూర్వక’ గుణాల ఆధారంగా 1 నుండి 10 స్కేల్‌లో ర్యాంక్ ఇచ్చారు.

మీకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే ఏ ఆహారాలు ప్రమాదకరమో, ఏవి మంచివో తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జాబితా సహాయపడుతుంది.

ఫ్యాటీ లివర్‌కు ఏది మంచిది? ఏది కాదు?

డాక్టర్ సేథి “మీరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా, లేదా మీ కాలేయ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారా? ఈ వీడియోలో తాజా శాస్త్రీయ పరిశోధనలు, వైద్య ఆధారాల ఆధారంగా ఫ్యాటీ లివర్‌కు ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలియజేసే 10 సాధారణ ఆహారాలను ర్యాంక్ చేశాను..’ అని ఆ వివరాలు షేర్ చేశారు. ఇందులో 10 అత్యుత్తమ స్కోరుగా చెప్పారు. ఈ జాబితాలో బ్లాక్ కాఫీ అత్యుత్తమంగా నిలిచింది.

  1. గ్రీన్ టీ: 5/10
  2. స్మూతీస్: 4/10
  3. బెర్రీస్: 7/10
  4. చియా, తులసి గింజలు: 8/10
  5. బీట్‌రూట్: 6/10
  6. బాగా పండిన అరటిపండు: 3/10
  7. తాజా పండ్ల రసం (Freshly squeezed fruit juice): 2/10
  8. అవకాడో: 9/10
  9. స్టోర్లలో కొన్న పండ్ల రసం (Store-bought fruit juice): 1/10
  10. బ్లాక్ కాఫీ: 10/10

అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?

మెడ్‌లైన్‌ప్లస్ (MedlinePlus) ప్రకారం ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది ప్రధానంగా రెండు రకాలు. ఒకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD), రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఆల్కహాలిక్ స్టెటోహెపటైటిస్ అని కూడా అంటారు). నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు కారణం ఇంకా పూర్తిగా తెలియదు. అయితే, పరిశోధకులు కొన్ని విషయాలను గుర్తించారు. ఈ సమస్య ఎక్కువగా కింది లక్షణాలు ఉన్నవారిలో కనిపిస్తుంది.

  • టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్ ఉన్నవారు.
  • ఊబకాయం ఉన్నవారు.
  • మధ్య వయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు (పిల్లల్లో కూడా ఇది రావచ్చు).
  • రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు.
  • అధిక రక్తపోటు ఉన్నవారు.
  • మెటబాలిక్ సిండ్రోమ్ వంటి కొన్ని జీవక్రియ సంబంధిత రుగ్మతలు ఉన్నవారు.
  • వేగంగా బరువు తగ్గినవారు.
  • హెపటైటిస్ సి వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు సోకినవారు.
  • కొన్ని రకాల విష పదార్థాలకు గురైనవారు.

(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం అందించడం కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024