తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ – ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ – ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి 2 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై రెండో వారంలో ప్రారంభమవుతుంది.

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు

రాష్ట్రంలో మళ్లీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి రెండు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.48 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ రాగా… స్పీచ్‌ పాథాలజీ పోస్టుల (4) భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది.

డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు – ముఖ్య వివరాలు

  • ఈ పోస్టులు మొత్తం 48 ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ లో 42 ఉండగా… ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ లో 6 ఉన్నాయి. అన్ని కలిపి 48గా ఉన్నాయి.
  • ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 14వ తేదీతో ప్రారంభమవుతుంది.
  • అర్హులైన అభ్యర్థులు జూలై 25 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
  • జూలై 26వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.
  • ఎంపికైన వారికి నెల జీతం – రూ. 58,850 – రూ. 1,37,050.
  • బీడీఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ డెంటర్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
  • దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి,
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
  • అధికారిక వెబ్ సైట్ – https://mhsrb.telangana.gov.in

స్పీచ్‌ పాథాలజీ పోస్టులు – ముఖ్య వివరాలు

స్పీచ్ పాథాలజీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 4 ఖాళీలను భర్తీ చేస్తారు. జూలై 12 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు జూలై 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూలై 28 నుంచి జూలై 29 తేదీల మధ్య అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మల్టీజోన్ 2లోనే ఈ నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 51320- రూ.127310 మధ్య జీతం చెల్లిస్తారు. https://mhsrb.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

RecruitmentTelangana NewsTrending TelanganaJobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024