కన్నప్ప ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే.. హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్లు.. డిజిటల్ స్ట్రీమింగ్ పై బజ్

Best Web Hosting Provider In India 2024

కన్నప్ప ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే.. హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్లు.. డిజిటల్ స్ట్రీమింగ్ పై బజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది.

కన్నప్ప పోస్టర్ (x/kannappamovie)

ఓ వైపు వివాదాలు.. మరోవైపు ట్రోల్స్.. ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాల నడుమ థియేటర్లకు వచ్చింది కన్నప్ప మూవీ. ఈ రోజు (జూన్ 27) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అనే ప్రశ్న రేకెత్తుతోంది.

ఓటీటీలోకి ఎప్పుడంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఇంకా అమ్మలేదు. కన్నప్ప డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కన్నప్ప రైట్స్ కోసం పోటీపడుతున్నాయని టాక్. దీంతో రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది.

10 వారాల తర్వాతే

కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పైనా బజ్ నెలకొంది. సాధారణంగా అయితే తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన మూడు లేదా నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ కన్నప్ప మూవీని మాత్రం 10 వారాల కంటే ముందు ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశ్యమే లేదని మంచు విష్ణు తేల్చిచెప్పడం గమనార్హం.

‘‘నాకు చాలా స్వేచ్ఛ ఉంది. నా సినిమా 10 వారాల కంటే ముందు ఓటీటీలోకి రాదు. నేను అనుకున్న డీల్ అదే. దేవుని దయ వల్ల నాకు ఎలాంటి రిలీజ్ ప్రెషర్ లేదు. ఆడియన్స్ కు బెస్ట్ చూపించాలన్నదే నా ఉద్దేశ్యం’’ అని మంచు విష్ణు ఇటీవల అన్నారు.

ఎన్ని కోట్లో?

కన్నప్ప మూవీ ఓటీటీ డీల్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటం, స్టార్ హీరోలు ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మంచు విష్ణు, ప్రభాస్, మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్, ముకేష్ రిషి తదితరులు ఈ మూవీలో నటించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం మంచు విష్ణు కూడా భారీ ధరనే డిమాండ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

కన్నప్ప సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ డైరెక్టర్. శివ భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు ఈ మూవీ నిర్మించారు. రూ.200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024