




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో ఇవాళ టాప్ 1లో దూసుకుపోతున్న 240 కోట్ల సూపర్ హిట్ థ్రిల్లర్- 7 రేటింగ్- 3 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో రూ. 240 కోట్లు కొల్లగొట్టిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ రైడ్ 2 దూసుకుపోతోంది. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలు పోషించిన రైడ్ 2 ఓటీటీలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ట్రెండింగ్ అవుతోంది. మరి రైడ్ 2 ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో మరో లేటెస్ట్ మూవీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో దంచికొడతాయని తెలిసిందే. అలా, మే 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన బాలీవుడ్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది.
హీరోయిన్‌గా హాట్ బ్యూటి
ఆ సినిమానే రైడ్ 2. 2018లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా రైడ్ 2 తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా, రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా ప్రధాన పాత్రలు పోషించిన రైడ్ 2 సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. అలాగే, ఈ సినిమాలో హాట్ బ్యూటీ వాణి కపూర్ హీరోయిన్‌గా చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్ 7
అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 240.06 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి సూపర్ హిట్‌గా నిలిచింది రైడ్ 2 చిత్రం. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ సాధించుకుని సత్తా చాటింది. అలాంటి రైడ్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. మొదట జూన్ 27న అంటే ఇవాళ రైడ్ 2 ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఒకరోజు ముందుగానే జూన్ 26న రైడ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజే రైడ్ 2 ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో రైడ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, పోర్చుగీస్, స్పానిష్ వంటి మూడు భాషల్లో రైడ్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1
ఇవాళ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1 ప్లేసులో రైడ్ 2 దూసుకుపోతోంది. డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చిన మరుసటి రోజే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో రైడ్ 2 అదరగొడుతోంది. రైడ్ కంటే మించిన థ్రిల్లింగ్ కంటెంట్ రైడ్ 2లో ఉండటంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
1990 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన రైడ్ 2 అవినీతి పరుడైన, అతి ప్రభావితుడైన రాజకీయ వేత్తను ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా బయటపెట్టాడన్నదే సినిమా కథ. అవినీతిపై యుద్ధం చేసే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగన్ నటించాడు. మరి థియేటర్లలో చూడని రైడ్ 2ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.
సంబంధిత కథనం
టాపిక్