



Best Web Hosting Provider In India 2024

తమిళ హారర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ – సినిమా డైరెక్టర్‌ను వెంటాడే ఆత్మలు
తమిళ హారర్ మూవీ డీమన్ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. డీమన్ మూవీలో సచిన్ మణి, అబర్నతి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమేష్ పళనీవేల్ దర్శకత్వం వహించాడు.
తమిళ హారర్ మూవీ డీమన్ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డీమన్ మూవీలో సచిన్ మణి, అబర్నతి హీరోహీరోయిన్లుగా నటించారు. సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. డీమన్ మూవీకి రమేష్ పళనీవేల్ దర్శకత్వం వహించాడు.
ఏడాదిన్నర తర్వాత…
సైకలాజికల్ హారర్ డ్రామాగా దర్శకుడు రమేష్ పళనీవేల్ ఈ మూవీని తెరకెక్కించారు. 2023 సెప్టెంబర్‌లో తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నది. లిమిటెడ్ బడ్జెట్‌లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, టర్న్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. డీమన్ మూవీకి రోనీ రాఫెల్ మ్యూజిక్ అందించాడు.
డీమన్ కథ ఇదే…
విఘ్నేష్ శివన్ (సచిన్ మణి) సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. విఘ్నేష్ చెప్పిన ఓ హారర్ కథ నచ్చడంతో అతడితో సినిమా చేసేందుకు ఓ ప్రొడ్యూసర్ ముందుకొస్తాడు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి సిటీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోకి అద్దెకు దిగుతాడు విఘ్నేష్.
ఆ అపార్ట్‌మెంట్‌లో నిద్రపోయిన తర్వాత విఘ్నేష్ శివన్‌కు విచిత్రమైన కలలు వస్తుంటాయి. కొన్ని ఆత్మలు అతడిని చంపాలని చూస్తాయి. ఆ అపార్ట్‌మెంట్‌కు ఆత్మలకు ఉన్న సంబంధం ఏమిటి? అందులో అద్దెకు దిగిన వారంతా ఎందుకు కనిపించకుండాపోతున్నారు? ఆ బిల్డింగ్ మిస్టరీని విఘ్నేష్ శివన్ ఎలా ఛేదించాడు? అతడు డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నదే డీమన్ మూవీ కథ.
హారర్ ఎలిమెంట్స్‌తో…
డీమన్ కథ మొత్తం చాలా వరకు ఒకే అపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా హారర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడం, ఒకే పాయింట్ చుట్టూ కథను సాగదీశారనే విమర్శలు సినిమాపై వినిపించాయి.
దళపతి విజయ్ లియోలో…
డీమన్ హీరో సచిన్ మణి తమిళంలో దళపతి విజయ్ లియోలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. హీరోయిన్ అబర్నతి తమిళంలో ఇరగపట్రు, మాయాపుథగంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.