





Best Web Hosting Provider In India 2024

రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా.. ఆ స్టార్ హీరో పేరు వచ్చేల నామకరణం.. ఏంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రెండోసారి కూడా కుమారుడిని కన్న ఇలియానా కొడుకు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషాన్ని పంచుకుంది. అలాగే రెండో కుమారుడి పేరు కూడా రివీల్ చేసింది ఇలియానా. అయితే, ఆ పేరు ఓ స్టార్ హీరోకు మ్యాచ్ అయ్యేలా ఉండటం ఆసక్తిగా మారింది.
టాలీవుడ్ హీరోయిన్గా సంచలనం సృష్టించిన బ్యూటిఫుల్ భామ ఇలియానా డి క్రూజ్. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా పోకిరి మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అగ్ర హీరోలతో జత కట్టి సెన్సేషనల్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది.
రెండో బిడ్డకు జన్మ
అయితే, తాజాగా ఇలియానా డి క్రూజ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫొటో షేర్ చేసి మరి చెప్పింది. రెండోసారి కూడా కుమారుడికి జన్మనిచ్చిన ఇలియానా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.
రెండో కొడుకు పేరు
శనివారం అంటే ఇవాళ (జూన్ 28) ఇలియానా తన రెండో కుమారుడి ఫొటోను షేర్ చేసి పుట్టిన తేదిని కూడా రాసుకొచ్చింది. అలాగే, బాబు పేరు కూడా ఏంటో చెప్పేసింది ఇలియానా. 2025 జూన్ 19న తనకు రెండో కుమారుడు పుట్టినట్లు ఫొటోలో తెలిపింది ఇలియానా. అలాగే, బాబు పేరు కియాను రఫే డోలన్ (Keanu Rafe Dolan) అని నామకరణం చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
దంపతులకు కంగ్రాట్స్
ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఇలియానా “మా హృదయాలు నిండిపోయాయి” అని క్యాప్షన్ రాసుకొచ్చిన ఇల్లు బేబీ హార్ట్, డైమండ్, కనుదిష్టి ఎమోజీలను యాడ్ చేసింది. ఈ పోస్ట్‌కు ఎంతోమంది అభిమానులు, ఫ్రెండ్స్, నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతూ ఇలియానా దంపతులను పొగుడుతున్నారు.
విచిత్రంగా ఉండటంతోపాటు
దీంతో సోషల్ మీడియాలో ఇలియానా రెండో కొడుకు ఫొటో, పేరు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలియానా కొడుకు పేరు విచిత్రంగా ఉండటమే కాకుండా ఓ స్టార్ హీరో పేరు వచ్చేలా ఉంది. అతనే హాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో కియాను రీవ్స్ (కీన్ రివ్స్). జాన్ విక్ మూవీ సిరీస్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కియాను రీవ్స్ పేరులా ఇలియానా రెండో కొడుకు పేరు కొంచెం ఉండటం ఆసక్తిగా మారింది.
రహస్యంగా ఇలియానా పెళ్లి
ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా 2023లో మే 13న మైఖేల్ డోలన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. గతేడాది 2024లో ఆగస్ట్ 1న మొదటి కుమారుడుకి జన్మనిచ్చింది ఇలియానా. మొదటి బాబు పేరు కోవా ఫీనిక్స్ డోలన్గా నామకరణం చేసింది ఇలియానా.
ఇలియానా బేబీ బంప్ ఫొటోలు
గతేడాది అక్టోబర్‌లో తన రెండో ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో పంచుకుంది ఇలియానా. మొదటి కుమారుడు బర్త్ డే సెలబ్రేషన్స్‌కు కొన్ని రోజుల తర్వాత రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది ఇలియానా. ఇక అప్పుడప్పుడు ఇలియానా బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేది.
సంబంధిత కథనం