




Best Web Hosting Provider In India 2024

15 ఏళ్లలో 10 వేల షోలు.. గరివిడి లక్ష్మిగా ఆనంది.. బుర్ర కథ శిఖామణి బయోపిక్.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ గ్లింప్స్
గరివిడి లక్ష్మి గా ఆనంది సందడి చేయనుంది. బుర్ర కథతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి బయోపిక్ గా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తాజాగా రిలీజైంది. ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
తెలుగులో మరో బయోపిక్ రాబోతోంది. తెలుగు మహిళ, బుర్ర కథతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథతో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ఆమె పేరే పెట్టారు. ‘గరివిడి లక్ష్మి’ మూవీలో ఆనంది టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను ఆదివారం (జూలై 20) రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఎక్కడ చూసిన ఆమెనే
గతంలో విజయనగరం జిల్లా గరివిడి వాస్తవ్యురాలు లక్ష్మి పేరు ఎక్కువగా వినిపించేదే. ఆమె బుర్ర కథ షోలు చాలా పాపులర్. 15 ఏళ్లలో 10 వేల స్టేజీ షోలు ఇచ్చింది. 1990ల్లో ఆమె ఆడియో క్యాసెట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన క్యాసెట్లుగా నిలిచాయి. గరివిడి లక్ష్మి అంటే అంత ఫేమస్. ఉత్తరాంధ్రలో పండగలు, ఉత్సవాలు ఇలా ఏ సందర్భమైనా గరివిడి లక్ష్మి బుర్ర కథ ఉండాల్సిందే.
ఆనంది క్యూట్ గా
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది క్యూట్ గా కనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ తో ఆమె ఇంట్రడక్షన్ సింపుల్ అండ్ సూపర్ గా ఉంది. బుర్రకథ కళాకారణి అయిన గరివిడి లక్ష్మి సంగీత వారసత్వానికి నివాళిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ‘అన్ టోల్డ్ ట్రూ స్టోరీ’గా ఈ మూవీ రెడీ అవుతోంది.
‘‘ఆ అమ్మి అడుగెడితే కుర్రాళ్లెవరు నేలమీద నిలబడరటా. ఆ అమ్మి పాట పాడితే పండు ముసలోళ్లు పరగెత్తుకొస్తారటా. ఆ అమ్మి గజ్జెకడితే ఊరు ఊరంతా ఊగిపోద్దటా. గరివిడి లక్ష్మి వచ్చిందటా’’ అనే డైలాగ్ తో గ్లింప్స్ అదిరిపోయింది. లాస్ట్ లో గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మైక్ ముందు మెరిసింది.
వరుస సినిమాలు
తెలుగమ్మాయి ఆనంది వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ఈ వరంగల్ భామ ఈ రోజుల్లో సినిమాతో తెరంగేట్రం చేసింది. బస్ స్టాప్, జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తదితర తెలుగు సినిమాలు చేసింది. చివరగా భైరవంలో మెరిసింది. ప్రియదర్శితో ప్రేమంటే మూవీ చేస్తోంది. మరోవైపు తమిళంలోనూ దూసుకుపోతోంది ఈ ముద్దు గుమ్మ.
ఇప్పుడు గరివిడి లక్ష్మి బయోపిక్ చేస్తోంది. ఈ సినిమాలో ఆనంది, నరేష్, రాశి, రాగ మయూర్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి గౌరీ నాయుడు డైరెక్టర్. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ నుంచే ఇప్పటికే ఓ పాట రిలీజైంది.
సంబంధిత కథనం